గ్రామాలలోని ప్రజలకు అనుకూలంగా వసతులను కల్పిస్తాం: ఎమ్మెల్యే

– శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా మౌలిక వసతులను గుర్తించి పరిష్కార మార్గంగా ముందుకు సాగుతమని మహబూబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ అన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రామలింగేశ్వర స్వామి ఆలయంలో జిల్లా నాయకుడు నాయన సత్యపాల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తో కలిసి ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో కోరగుట్టపైశ్రీ సీతారామచంద్రస్వామి ప్రతిష్టింపజేసిన రామలింగేశ్వరుని ఆలయ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి గుట్టపై కోనేరును సందర్శించి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఈ గుట్ట అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని అన్నారు. గ్రామాన్ని గతంలో తాను సందర్శించినప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని పునరుద్ఘాటించారు. గుట్ట వరకు భక్తులు రావడానికి రోడ్డు సౌకర్యం, విద్యుత్ సరఫరా, త్రాగునీరు, గుడి పునర్నిర్మాణం వంటి అభివృద్ధి పనులు దేవాదాయశాఖ నిధులతో చేపట్టడం జరుగుతుందన్నారు. అందుకు ప్రణాళికలు చేసి ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేస్తోందన్నారు. అన్నదానం మహాదానమని అన్నదానాన్ని నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీనీ అభినందించారు.  ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జెల్లా వెంకటేష్, మాజీ సర్పంచ్ డోనికెన జ్యోతి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ గంజి గోవర్ధన్, జిల్లా నేతలు కాసం లక్ష్మారెడ్డి, గుగులోతు బాలాజీ నాయక్, పట్నం శెట్టి నాగరాజు, జీలకర యాలాద్రి, గ్రామ శాఖ అధ్యక్షులు బెల్లి నరసయ్య, మద్దెల సమ్మయ్య, ఆవుల వెంకన్న, ఆలయ అర్చకులు కపిలవాయి కృష్ణమూర్తి, రాంబాబు, రామలింగేశ్వర స్వామి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులున్నారు.
Spread the love