కుల్లాగా విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం

నవతెలంగాణ -తాడ్వాయి
విత్తన దుకాణాలలో కుల్లాగా విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని కామారెడ్డి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అపర్ణ తెలిపారు. తాడ్వాయి మండల కేంద్రంలోని విత్తన, పురుగుమందుల దుకాణాలను ఆమె బుధవారం తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొందరు డీలర్లు కుల్లాగా విత్తనాలు విక్రయిస్తున్నారని, అలాంటి వారు అలాగే కుల్లగా విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు విక్రయించాలని సూచించారు. పురుగుమందులకు విత్తనాల బస్తాలకు కచ్చితంగా బిల్లులు ఇవ్వాలని తెలిపారు. లేబుల్ ఉన్న విత్తన విత్తనాల బ్యాగులను, పురుగుమందులను విక్రయించాలన్నారు. ఎక్కడైనాలే బిల్లులు లేకుండా విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి దుకాణంలో స్టాక్ బోర్డ్, ధరల పట్టిక ఉండాలన్నారు  రైతులు తీసుకునే విత్తనాలు పురుగుమందుల బిల్లుల పైన కచ్చితంగా రైతుల సంతకం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, తాడువాయి మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్, పురుగుమందుల విత్తనాల డీలర్లు శ్రీనివాస్ రెడ్డి, తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love