లక్షా యాభై వేల మెజార్టీతో గెలిపిస్తాం

– కూర మాణిక్య రెడ్డి, ఎంపిపి.
నవతెలంగాణ – చిన్నకోడూరు 

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని లక్షా యాభై వేల మెజార్టీతో గెలిపిస్తామని ఎంపీపీ మాణిక్య రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికులు 1700 మంది కుటుంబాలు ఏకగ్రీవంగా మంత్రి హరీష్ రావుకు ఓటు వేస్తామని తీర్మానం కాపీ అందజేసినట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధికి మంత్రి హరీష్ రావు కృషి చేస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులందరికీ మంత్రి హరీష్ రావు సొంత ఖర్చులతో కార్డులు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి మంత్రి హరీష్ రావును గెలిపించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించవలసిందిగా కోరారు. ప్రాజెక్టులు నిర్మాణం చేసి నేడు రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులందరికీ సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసరి పాపయ్య సర్పంచుల పోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, అల్లిపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్, రైతు సమన్వయం జిల్లా సభ్యులు వెంకటేశం, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొండం రవీందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంటయ్య, భవన నిర్మాణ కార్మికుల మండల అధ్యక్షులు నారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love