జాతీయ రహదారిపై వెల్కమ్ టు నిజామాబాద్ ప్రత్యేక స్వాగత తోరణం ఏర్పాటు..

నవతెలంగాణ -డిచ్ పల్లి
స్వాగత తోరణం మోడల్ను డిచ్ పల్లి జాతీయ రహదారిపై ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి స్వాగత తోరణం ఏర్పాటు కోసం హైదరాబాద్ నుంచి బుధవారం ముగ్గురు అర్కిటెక్చర్ ఇంజనీర్లు డిచ్ పల్లి గ్రామానికి వచ్చి పరిశీలించారు. ఇందుకు సంబంధించిన కొలతలను సేకరించారు. డిచ్ పల్లి జాతీయ రహాదారి వద్ద నిజామాబాద్ కు వెళ్లు మూలమలపు వద్ద వెల్కమ్ టు నిజామాబాద్ బోర్డు ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇటీవల రామాలయానికి వచ్చి ఇక్కడ చెపట్టాల్సిన అభివృద్ధి పనులపై రెండుగంటలపాటు ఇక్కడే ఉండి పూర్తి వివరాలను స్థానికులు, ప్రజా ప్రతినిధులతో కలిసి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుండి బుధవారం ఆర్కిటెక్చర్ ఇంజనీర్లను పంపిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురు వాస్తు శిల్పులకు ఆలయ కమిటి చైర్మన్ మహేందర్రెడ్డి, డైరెక్టర్ వినోద్ లు పూర్తి వివరాలను తెలియచేశారు. 18న ప్రత్యేక స్వాగత తోరణం కోసం భూమిపూజ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రామాలయానికి శిఖర నిర్మాణం కోసం డిచ్ పల్లి రామాలయానికి శిఖర నిర్మాణానికి డిజైనింగ్ చేయడానికి ఆర్కిటెక్చర్ ఇంజనీర్లు కొలతలు తీసుకున్నారు.
Spread the love