నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం

– టీవీఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ చైర్మెన్‌ టి.కోటిరెడ్డి
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
టీవీఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ చైర్మెన్‌ టి.కోటిరెడ్డితో ‘ఇంటరాక్షన్‌ ప్రోగ్రాం’ టీవీఆర్‌ మోడల్‌ హై స్కూల్‌ అపురూప కాలనీలో శుక్రవారం నిర్వహించారు. 10వ తరగతి 100 శాతం ఉత్తీర్ణత, అత్యధికంగా 10/10 జీపీఏ రావడానికి కషిచేసిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఉపాధ్యాయ బందానికి 2024 – 2025 విద్యా సంవత్సరానికి తగు సూచనలు ఇస్తూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన విద్యా విధానాన్ని అవలంబిస్తూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా బోధన అందించాలని సూచించారు. విద్యతో పాటు సంస్కారవంతులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యతను గుర్తు చేశారు. సెల్‌ ఫోన్‌, టీవీ వంటి మాధ్యమాలకు దూరంగా ఉండే విధంగా తగు సూచనలు అందించాలని తెలియజేశారు. జీవిత విలువలతో పాటు చక్కటి క్రమశిక్షణ అలవర్చుకునే విధంగా విద్యార్థిని విద్యార్థుల మనస్తత్వాన్ని గమనించి, మానసిక దఢత్వాన్ని మనోధైర్యాన్ని నింపుతూ.. కాలానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించి పరిపూర్ణమైన విద్యార్థులుగా తయారు చేయడం మన బాధ్యతని వారు సూచించారు.

Spread the love