మోడీ ప్రభుత్వం లేబర్‌కోడ్స్‌ను కార్మికుల మీద రుద్దడం ద్వారా పోరాటాలను ఆపగలి గిందా? కాంట్రాక్టీకరణ, తమ వలస కార్మిక వ్యవస్థ కార్మికులు పోరుబాట పట్టకుండా నిలప గలిగిందా? సంప్రదాయాల పేరుతో ‘శ్రమశక్తి -2025’ కార్మికోద్యమాన్ని అణచివేయ గలదా? ఏప్రిల్ మొదటి రెండువారాలలో, ఉత్తర భారత దేశంలో కార్మికుల ఆకస్మిక పోరాటం అందరి దృష్టి ఆకర్షించింది. ఫలితాలను, పరిమితులను కూడా కండ్ల ముందుంచింది. తెలంగాణలో జరిగిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె, ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా అనేక అనుభవాలను అందించాయి. గత ఐదారు మాసాల్లో దేశంలో కార్మికుల స్పందన పరిశీలిస్తే కార్మికో ద్యమం నేర్చుకోవాల్సిందేమిటో అర్థం చేసుకోవచ్చు. తనిఖీల వ్యవస్థ పోవాలని, సరళీకరణ పేరుతో కార్మిక హక్కులు రద్దు చేశారు. చట్టాల రక్షణకు ముందే వాటి అమలును అటకెక్కిం చారు. సుమారు రెండు దశాబ్దాలుగా కనీస వేతనాల సవరణ చేయలేదు. ఆధునిక యంత్రాల వినియోగంతో కార్మికుల ఉత్పాదకత అనేక రెట్లు పెరిగింది. ఈ ఫలితాలన్నీ పెట్టుబడి దారీ వర్గమే అనుభవిస్తున్నారు. పైగా పనిగంటలు పెంచారు. పెరిగిన ఉత్పాదకతతో సరుకులకు తగు శ్రమశక్తి వినియోగం ద్వారా జోడించిన విలువలో కార్మికులకు దక్కేది ఎనభయ్యవ దశకంతో పోలీస్తే సగానికి పడిపోయింది. తమకు దక్కవలసిన శ్రమ విలువను కార్మికవర్గం కోల్పోతూనే ఉన్నది.
పెరిగిన కాంట్రాక్టీకరణ, తాత్కాలిక నియామక (నాన్ రెగ్యులర్) వ్యవస్థ ఫలితంగా కార్మికుల సమిష్టి బేరసారాల శక్తి బలహీనపడింది. అంతిమంగా యజమానుల వద్ద సంపద పెద్ద ఎత్తున పోగు అవుతున్నది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో, ఈ సంపద పెట్టుబడి రూపంలో కూడా పని చేయటం లేదు. రూ. లక్షల కోట్ల నిధులు బడాబాబుల దగ్గర నిరుపయో గంగా పడి ఉన్నాయి. అయినప్పటికీ రాజ్యం మాత్రం పెట్టుబడిదారులకే అండగా ఉన్నది. అంతిమంగా కార్మికుల త్యాగం పెట్టుబడిదారుల భోగాలకు వాడుకుంటు న్నారు. బడా బాబుల దుబారా ఖర్చులకు హద్దులేవు.
వేతనాలు పెరగకపోవడం, పెరుగుతున్న ధరలు, శ్రమదోపిడీ, పనిస్థలంలో వేధింపుల ఫలితంగా కార్మికులలో అసంతప్తి పెరిగింది. ఆకస్మిక సమ్మెల రూపంలో వ్యక్తమవు తున్నది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో పెల్లుబికిన కార్మికుల ఆగ్రహాన్ని అణచివేసేందుకు పాలకులు అన్ని ప్రయత్నాలు చేసారు. సుమారు నాలుగు వందల మందిని అరెస్టు చేశారు. అక్రమ కేసులు బనాయించారు. పరామర్శకు వెళ్లిన జాతీయ నాయకులను కూడా అడ్డుకున్నారు.
శాంతియుత ప్రదర్శనలు కూడా సహించని పాలకులు భారతీయ న్యాయ సంహిత 163 సెక్షన్ పేరుతో తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. అయినా కార్మికుల ప్రతిఘటన ఆగలేదు. ఇవన్నీ సంఘటిత కార్మిక ఉద్యమం అంతగా లేని ప్రాంతాలే కావడం గమనార్హం. కనీసం వీరికి యూనియన్లు కూడా లేవు. పాలకులు మాత్రం అలవాటు ప్రకారం ఈ పోరాటం వెనుక ‘బయటి శక్తులు’ ఉన్నాయని, ‘విదేశీ లింకులు’ ఉన్నాయని, పోరాటంలో ముందుపీఠిన ఉన్నవారంతా దేశద్రోహులని, కుట్రదారులని ప్రచారం చేశారు. అరెస్టయిన వారికి న్యాయ సహాయం చేసిన వారిని కూడా వేధించారు. పోలీసులు గ్రామాల మీద దాడులు చేసారు. కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేసారు. నాలుగు రాష్ట్రాల కన్నా ముందే బీహార్,గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో కూడా కొన్ని సంస్థల కార్మికులు సమరశీలంగా పోరాడారు. మేడ్చల్ జిల్లాలో 1600 మంది షాహీ ఎక్స్‌పోర్ట్స్ మహిళా కార్మికులు పది రోజుల పాటు చేసిన పోరాటం గమనించవచ్చు. రాత్రి, పగలు అన్న తేడాలు లేకుండా రోడ్డు మీద బైటాయించారు. వీరికి కూడా యూనియన్ లేదు. మహిళలమన్న భయం లేదు. వారి పట్టుదల, తెగింపు, ఐక్యత అనూహ్యం. పోరాటం మొదలైన తర్వాతనే కేంద్ర కార్మిక సంఘాలు సహకారం అందించాయి. విచ్ఛిన్నం చేసేందుకు యజమాన్యం చేయని ప్రయత్నం లేదు.
బెదిరింపులకు హద్దుల్లేవు. అయినా కార్మికులు ఐక్యంగా పోరాడారు. అంతిమంగా కొన్ని సమస్యలు పరిష్కారమై, త్రైపాక్షిక ఒప్పందంతోనే సమ్మె విరమించారు. యజమాన్యం తమను క్షమించాలని కోరవలసి వచ్చింది. అదే జిల్లాలో హెచ్.బీ.ఎల్ కార్మికులు కూడా మెరుపు సమ్మె చేసి, యజమాన్యం వేతనాల పెంపునకు అంగీకరించడంతో మూడోరోజు సమ్మె విరమించారు. వీరికీ యూనియన్ లేదు. విద్యుత్ రంగంలో పదివేల మంది ఆర్టిజన్లు అన్‌మేన్, పీస్‌రేట్ కార్మికులతో సహా రాష్ట్ర వ్యాపితంగా చేసిన పది రోజుల సమ్మెకూడా ప్రాధాన్యత సంతరించుకున్నది. సమ్మె విచ్ఛిన్నం చేయడానికి అధికారులు, ఆర్టిజన్ల స్థానంలో రెగ్యులర్ ఉద్యోగులకు డ్యూటీలు వేశారు. సమ్మెలో ఉన్న కార్మికులకు వందలాది మందికి టర్మినేషన్ నోటీసులు ఇచ్చారు. అయినా కార్మికులు భయపడలేదు. కార్మికశాఖ కూడా కార్మికుల పక్షం వహించలేదు. సమస్యల పరిష్కారానికి ప్రయత్నించే బదులు, చట్టం పేరుతో కన్సిలియేషన్ ప్రొసీడింగ్స్ ప్రారంభించింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించింది. మూడు రోజుల తర్వాత మంత్రులు, అధికారులతో చర్చల అనంతరం సమ్మె గౌరవప్రదంగా ముగిసింది. టర్మినేషన్ నోటీసులకు భయపడి ముందే డ్యూటీలకు వెళ్లిన కొందరు మళ్లీ సమ్మె చేయబోమని రాతపూర్వకంగా ఇచ్చి పనిలో చేరారు. చివరిదాకా పోరాటంలో నిలబడిన వారిని మాత్రం బేషరతుగా డ్యూటీ లోకి అనుమతించవలసి వచ్చింది. సుమారు నలభై వేల మంది ఆర్టీసీ కార్మికులు కూడా ఐక్య పోరాటంతో కొన్ని ఫలితాలు సాధించారు.
ఈ సందర్భంలో కూడా యజ మాన్యం, సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది. అద్దె బస్సులు, విద్యుత్ బస్సుల పేరిట ప్రయివేటు బస్సులు నడిపేందుకు ప్రయత్నించింది. కార్మికశాఖ కూడా ‘కన్సిలియేషన్ ప్రొసీడింగ్స్’ ఆయుధాన్ని కార్మికులకు వ్యతిరేకంగా ప్రయోగించింది. మూడవ రోజు చర్చలతో పరిష్కరించక తప్పలేదు. మంత్రులు, అధికారులతో జరిగిన సుదీర్ఘ చర్చల ఫలితంగా నాల్గవ రోజు సమ్మె విరమించారు. ఉత్తర భారత దేశంలో జరిగిన పోరాటాలూ కూడా వధా పోలేదు. అనివార్యంగా హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక మేరకు కనీస వేతనాలు పెంచక తప్పలేదు. ఈ పోరాటాలకు ఆధునిక డిజిటల్ క్యాంపెయిన్స్ కూడా తోడ్పడినట్టు తెలుస్తున్నది. ఈ పోరాటాల ఫలితంగా ఏదో ఒకమేరకు యజ మాన్యాలు దిగిరాక తప్పలేదు. సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని మరోసారి రుజువైంది. కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు అండ చూసుకుని పెట్టుబడిదారులు ఎంత మొండిగా వ్యవహరించినా, అంతిమంగా వారికి ఉత్పత్తి, లాభాలుకావాలి. కార్మికులు సమ్మె విరమించి, పనిలోకి దిగడం వారి అవసరం కూడా. కార్మికులు ఐక్యంగా పోరాడడాన్ని లేబర్ కోడ్స్ గానీ, పాలకుల నిర్బంధం గానీ అడ్డుకోలేక పోయాయి. సంఘటిత కార్మికోద్యమం, వామపక్ష రాజకీయాలు బలపడితే మరిన్ని ఫలితాలు సాధించవచ్చు.
ఈ పోరాటాల సందర్భంగానే కొన్ని రాజకీయ పార్టీల అసలు రంగు బయటపడింది. పెట్టుబడిదారీ వర్గం మీద ఎక్కుపెట్టిన ఏ సమ్మెకు కూడా ఎర్రజెండా పార్టీలు తప్ప, ఇతరులెవరూ మద్దతు నివ్వలేదు. షాహీ, హెచ్.బీ.ఎల్ కార్మికుల సమ్మె సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు యాజమాన్యం తరపున రంగంలోకి దిగి కార్మికులను మోసం చేసేందుకు ప్రయత్నించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను కూడా ఈ మూడు పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. అంతిమంగా కమ్యూని స్టులే పోరాడే కార్మికవర్గానికి అండగా నిలవడం కార్మికుల అనుభవం. కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడటం కార్మిక వర్గానికి అవసరమని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. క్రమంగా కార్మిక వర్గంలో అసంతప్తి పెరుగుతున్నది. ఐక్య పోరాటాల అవసరం గుర్తిస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఇప్పుడు తరచుగానూ, విస్తతంగానూ, అనేక రంగాలలో పోరాటాలు పెరుగుతున్నాయి. సమరశీలత కూడా పెరుగుతున్నది. కేవలం సంఘటిత కార్మికోద్యమం సహకా రంతో సాగే సమ్మెలకు పరిమితం కాలేదు.
ఆకస్మిక, సమరశీల పోరాటాలు ముందుకొస్తున్నాయి. గత నాలుగైదేండ్ల పరిణా మాలు చూసినా, గతంలో అప్పుడప్పుడు ముందస్తు పిలుపులతో జరిగే నిరసనలే ప్రధానం. సంఘటిత కార్మికోద్యమం పాత్ర కీలకం. ఇప్పుడు పెరిగిన సమస్యలు, యజమానుల దోపిడీ, కాంట్రాక్టీకరణ, భద్రత లేని ఉపాధి వంటి కారణాల వల్ల నిరంతరం అసంతప్తి వాతావరణం ఉంటున్నది. సంఘటిత కార్మికులే కాదు, పాలకుల అంచనా లకు భిన్నంగా కాంట్రాక్టు, వలస, నాన్ రెగ్యులర్ ఉద్యోగులతో సహా అసంఘటిత కార్మికులు సమ్మెలలో దూకుతున్నారు. ప్రభుత్వ విధానాలే నిరంతర పారిశ్రామిక అశాంతికి కారణ మవుతున్నాయి. మారుతున్న పరిస్థితుల కనుగుణంగా సంఘటిత కార్మికోద్యమం జోక్యం పెరగాలి. అందుకే సంఘటిత కార్మికోద్యమం, ఎర్రజెండా రాజకీయాల ప్రాధా న్యత మరింత పెరిగింది.
ఎస్.వీరయ్య
కార్మికుల ఆకస్మిక పోరాటాలు నేర్పుతున్నదేమిటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



