వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఏది..

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో ఈ రోజు నిజ్జన రమేష్గ్ పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఎల్లారెడ్డి బహిరంగ సభలో మంత్రి కేటిఆర్ ఎల్లారెడ్డి లో అభివృద్ధి జరుగుతుంది అన్నారు కె టి ఆర్ మాటలు పెద్ద మాయ మాటలు తప్ప ఏం లేదని డబల్ బెడ్ రూమ్ లు ఎన్ని కట్టించారు చెప్పాలి వడగండ్లవానలతో నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేరు సమాధానం ఇవ్వాలి. ముఖ్యమంత్రి కేసీఆర్  నష్టపోయిన రైతులకు 10 వేలు ఇస్తానని అని మోసం చేశారనిఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేరు రైతులు బోర్లు వేసి అప్పులు ఎక్కువై దుబాయ్ కి వెళ్తున్నారు కనీసం చనిపోతే తెచ్చే పరిస్థితి లేదు తెలంగాణరాష్ట్రంఏర్పడిన తరువాత వలసలు ఎక్కువయ్యాయి బెల్టుషాపులు పెంచి యువత ను ఆగం చేస్తున్నారు ఉపాధి కల్పించడం లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బ్రతికున్న రైతులకు భరోసా ఇవ్వకుండా చనిపోయిన రైతు బీమా ఇచ్చినం అని గొప్పలు చెప్పడం సిగ్గుచేటుఅని టి జె ఎస్  పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ నిజ్జన రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వాకేట్ దుర్గారెడ్డి ,జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, విద్యార్థి నాయకులు విజయ్ ,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love