రాష్ట్రంలో కమ్యూనిస్టులకేమున్నదనీ, కార్యకర్తలే లేరనీ, జెండాలు మోసేందుకు ఆశాలను, అంగన్‌వాడీలను వాడుకుంటున్నారనీ సీపీఐ, సీపీఐ(ఎం) ఉచ్చులో పడొద్దనీ హరీశ్‌రావు అన్నట్టు వార్తలు వచ్చాయి. సహజంగానే కమ్యూనిస్టు శ్రేణులకూ, ప్రజాస్వామ్యవాదులకూ ఆగ్రహం తెచ్చే విషయమిది. రాష్ట్ర మంత్రివర్గంలోనూ, బీఆర్‌ఎస్‌లోనూ కీలక స్థానాలలో ఉన్న నాయకుల మాటల ప్రభావం తక్కువేమీ ఉండదు. అనాలోచితంగా అనవల్సిన మాటలు కాదు. అట్లా అనే నాయకుడు కూడా కాదు ఆయన. దీనికి తోడు, ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ ‘రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని’ అన్నారు. ‘వామపక్షాలతో సర్దుబాట్లు ఉండవా?’ అన్న ప్రశ్నకు ‘చూస్తారుగా…’ అని దాటవేసారు. సహజంగానే ఈ వ్యాఖ్యలన్నీ అనేక అనుమానాలకు అవకాశమిస్తాయి.
ప్రతి రాజకీయ పార్టీకీ, తమ గురించే కాకుండా, ఇతర పార్టీల బలాబలాల గురించి కూడా అంచనాలు ఉంటాయి. ఆయా అంచనాల తప్పొప్పులు ఆచరణలో తేలుతాయి. కొన్నింటిని కాలం పరిష్కరిస్తుంది. బీఆర్‌ఎస్ నాయకులకు కూడా కమ్యూనిస్టుల పట్ల అంచనానే ఉండకూడదని ఎవరూ అనజాలరు. కానీ హరీశ్‌రావు వ్యాఖ్యలు అసందర్భం… అవాంఛనీయం. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ముసురుకుంటున్న సమయంలో మాట్లాడవల్సిన తీరు కాదు. ఒకవైపు దేశంలో బీజేపీ పాలన దుష్ప్రభావాలు చూస్తున్నాం. ధరల పెరుగుదల, ఉపాధి సమస్యలు, ఆర్థిక అసమానతలు, మహిళలమీద లైంగిక దాడులు, కులదురహంకార దాడులు పెరుగుతున్నాయి. రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా మిలటరీ పదఘట్టనల కింద నలుగుతున్నది కాశ్మీర్. ఇప్పుడు మణిపూర్ మండుతున్నది. దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక విలువలు మంటగలుపుతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణలో కూడా తిష్టవేయాలని బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. తాత్కాలికంగా, ఈ ఎన్నికల సందర్భంగా అవకాశాలు తగ్గి ఉండవచ్చు. ఎత్తుగడలు మారుతున్నాయి తప్ప బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నాలు ఆగలేదు. ఆగవు కూడా. ఇలాంటి రాజకీయ వాతావరణంలో బీఆర్‌ఎస్ నాయకత్వం కమ్యూనిస్టులతో కయ్యం కోరుకుంటున్నదనుకోలేం. పైగా మునుగోడు ఎన్నికల ఫలితాల అనంతరం, ‘రానున్న ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టులు, మేమూ కలిసే పనిచేస్తామ’ని ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు సహజంగానే బీఆర్‌ఎస్-వామపక్షాల మధ్య సర్దుబాట్లుంటాయని ప్రజలు భావిస్తారు. వామపక్షాలకు కూడా అందుకేమీ అభ్యంతరాలు లేవు. మరోవైపు త్వరలో బీఆర్‌ఎస్ అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో, సాధ్యమైనంత త్వరగా వామపక్షాలతో సర్దుబాట్లు చేసుకోవాల్సిన సమయంలో బీఆర్‌ఎస్‌లో కీలక నేతల వ్యాఖ్యలు అనుమానాలకు అవకాశం ఇస్తున్నాయి. సర్దుబాట్లు జరగటం తమ ప్రయోజనాలకు నష్టమని భావిస్తున్న పార్టీలు ”బీఆర్‌ఎస్ నాయకత్వం ఇతరులను వాడుకుని వదిలేస్తారనీ… మునుగోడులో కమ్యూనిస్టులను అట్లానే వాడుకున్నార”నీ ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, బీజేపీ-బీఆర్‌ఎస్‌ల మధ్య అంతర్గత బంధం ఉన్నదని కూడా కాంగ్రెసుగానీ, మీడియాలో ఒక భాగంగానీ బహిరంగంగానే ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కమ్యూనిస్టుల పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు ఎవరికి ఉపయోగపడతాయి? ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) సహా కీలకమైన, విధానపరమైన అంశాలన్నింటిలో బీఆర్‌ఎస్ నాయకత్వం స్పష్టంగానే బీజేపీ విధానాలకు వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నది. అదే సమయంలో వాడుకోవటం కాదనీ, కలిసి నడిచామనీ… కలిసే నడుస్తామనే సంకేతాలు పోవాల్సిన సమయమిది. ప్రజలకు విశ్వాసం కల్పించవల్సిన సందర్భం.
ఏ పార్టీ చరిత్ర ఏమిటో తెలియనివారు కాదు ప్రజలు. కీలకమైన రాజకీయాంశాలు మాట్లాడేటప్పుడు సంకుచిత ధోరణి పనికిరాదు. దూరదృష్టి కావాలి. శాసనసభ ఎన్నికలలో బీఆర్‌ఎస్ నాయకత్వం ఒంటరిగానే పోటీ చేస్తుందని రాజకీయాలు పరిశీలిస్తున్నవారెవరూ భావించజాలరు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాద ప్రభావం ఒకవైపూ, కాంగ్రెసు ప్రచారం మరోవైపూ ఉన్న తరుణంలో ఒంటరి పోరుకు సిద్ధపడతారని అనుకోలేం. కొన్ని తరగతులలో, సమూహాలలో బీఆర్‌ఎస్ పట్ల అసంతృప్తి ఉన్నమాట నిజం. అలాంటివారి సమస్యలు పరిష్కరించటం, నచ్చజెప్పటం ద్వారా మాత్రమే ముందుకు సాగగలరు. అంతే తప్ప, ఆ ప్రజలు గౌరవించే పార్టీలను హేళన చేయటం ద్వారా ఏమి సాధించగలరు? సాధారణ ప్రజలలో వామపక్షాల పట్ల సదభిప్రాయం, గౌరవం ఉన్నవారిలో వ్యతిరేకత పెంచుకోడానికే ఇలాంటి వ్యాఖ్యలు తోడ్పడతాయి. రాష్ట్రంలో మతోన్మాదం ప్రమాదాన్ని తక్కువ అంచనావేయటం తగదు. రానున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారు బీజేపీ కానంతమాత్రాన నిర్లక్ష్యం పనికిరాదు. దీర్ఘకాలిక ప్రమాదాన్ని విస్మరించకూడదు. పార్లమెంటు ఎన్నికల లక్ష్యం కూడా మరువరానిది. ఇప్పుడు ఓట్లు పెరిగినా భవిష్యత్తుకు ముప్పు. రాష్ట్రంలో మతసామరస్యం చాలా సున్నితమైంది. ఏ క్షణంలోనైనా చిచ్చుపెట్టవచ్చు. భావోద్వేగాలు రెచ్చగొట్టవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగానే ‘రజాకార్ ఫైల్స్’ పేరుతో సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘కాశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’ పేరుతో చేసిన ప్రయత్నాలు చూసాం కదా! కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా అవసరం. వామపక్షాలతో కలిసి నడిచే ప్రయత్నం కేవలం ఓట్ల కోసమేనా! ఓట్ల దృష్టితోనే మాట్లాడుకోవాలా! కాదు. రాష్ట్రాల హక్కులు, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు వంటి విస్తృత ప్రయోజనాల కోసం పనిచేయాలి. అంతేకాదు, ‘ఉచితాల’ పేరుమీద బీజేపీ సంక్షేమ పథకాల మీద కూడా దాడి చేస్తున్నది. ప్రజల సంక్షేమం కోసం వామపక్షాలు, బీఆర్‌ఎస్ కలిసి పనిచేయాలి.
ఎన్నికలలో బీఆర్‌ఎస్‌తో కలిసి పని చేయటమంటే వామపక్షాలకు అధికార పార్టీతో విభేదాలేమీ లేవని కాదు. రాష్ట్రంలో కోటిమంది కార్మికులకు వర్తించే కనీస వేతనాలు సవరించలేదు. గ్రామపంచాయతీ కార్మికులు పోరాడు తున్నారు. అంగన్‌వాడీలు, ఆశాలు, ఐకేపీ వీఓఏలు, మధ్యాహ్న భోజనం కార్మికులు, మున్సిపల్ కార్మికులు, వీఆర్‌ఏలు, పంచాయతీ కార్యదర్శులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడవల్సి వచ్చింది. ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కావల్సి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వో ద్యోగులు, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. ‘ధరణి’ సమస్యలు , రుణమాఫీ కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ కార్మికుల గురించిన మాటే పాలకులనుంచి రావటంలేదు. ఇండ్లు, ఇండ్లస్థలాలు, డబల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్యలు పరిష్కారం కావాలి. అనేక సందర్భాలలో పాలకుల అప్రజాస్వామిక ధోరణుల మీద కూడా పోరాడవల్సి వస్తున్నది. కార్మికుల సమిష్టి బేరసారాల హక్కును గుర్తించకపోవటం చూస్తున్నాం. ధర్నాచౌక్ పరిరక్షణ కోసం కూడా పోరాడక తప్పలేదు. అవకాశవాద ధోరణులు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నప్పటికీ, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరా డుతూనే, దేశ ప్రయోజనాల కోసం విశాల దృక్పథంతోనే, రాజకీయ లక్ష్యంతోనే బీఆర్‌ఎస్‌తో సర్దుబాటుకు వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. దేశంలో మతోన్మాద ప్రమాదాన్ని ఎదుర్కోవల్సిన బాధ్యత కేవలం వామపక్షాలదే అనుకోరాదు. ఆ బాధ్యత బీఆర్‌ఎస్ మీద కూడా ఉన్నదని గుర్తించాలి. ఈ బాధ్యతను ఏమాత్రం విస్మరించినా దేశ సమైక్యతకు, ప్రజా ప్రయోజనాలకు కలిగే హానిని విస్మరించడమే అవుతుంది.
ప్రజా పోరాటాల పట్ల అసహనం, కమ్యూనిస్టుల పట్ల చులకనగా మాట్లాడటం రాష్ట్రంలో ఏ శక్తులు వినియోగించుకుంటాయో గమనించాలి. కమ్యూనిస్టులది ఘనమైన చరిత్ర. స్వాతంత్య్రో ద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిది. పేదల హక్కుల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం కమ్యూనిస్టుల త్యాగాలు అనితర సాధ్యం. శతృవులు కూడా ఈ విషయంలో విభేదించ జాలరు. కమ్యూనిస్టు ఉద్యమంలో తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులు వచ్చి ఉండవచ్చు. అవే శాశ్వతం అనుకోవటం పొరపాటు. చరిత్రను విస్మరించడమే! శత్రుపక్షంలో ఉన్నవారు ప్రత్యక్ష దాడులతో దెబ్బతీస్తారు. కలిసి నడవవల్సిన వారు నిర్లక్ష్యం, హేళనతో బలహీన పరచాలనుకుంటే నష్టం ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ… ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి కూడా. దేశంలో వామపక్ష ఉద్యమం ప్రాధాన్యత గురించి అనేక సందర్భాలలో వామపక్ష వ్యతిరేకులు కూడా గుర్తిస్తారు. బెంగాల్‌లో వామపక్ష సంఘటన ఓడిపోయిననాడు వామపక్ష వ్యతిరేకులు కూడా దుర్దినంగానే భావించారు. వామపక్షం బలహీనపడితే ప్రజల గురించి ఈమాత్రం ఆలోచించే పరిస్థితి కూడా పోతుందన్నారు. అనేకమంది విశ్లేషకులు బహిరంగంగానే చెప్పారు. అందువల్ల వామపక్షం గురించి ఆషామాషీ ఆలోచనలూ, అంచనాలు తగవు. విస్తృత ప్రయోజనాల కోసం విశాల దృక్పథం అవసరం.
మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్, వామపక్షాల మధ్య సహకారం ప్రజాస్వామ్యవాదుల మన్ననలు పొందింది. మతోన్మాదుల స్పీడుకు బ్రేకులు వేసింది. ఈ సహకార ధోరణి కొనసాగాలని కోరుకుంటున్నారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల ప్రాధాన్యత రీత్యా బీఆర్‌ఎస్ కూడా వామపక్షాలతో కలిసి నడిచేందుకు సిద్ధపడవచ్చు. అది సాధ్యం కానప్పుడు సహజంగానే సీపీఐ-సీపీఐ(ఎం) కలిసి నడుస్తాయి. ఏం జరుగనున్నదో వేచి చూడవల్సిందే. ఎస్. వీరయ్య
అనుచిత వ్యాఖ్యలు ఎవరికి లాభం?

మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్, వామపక్షాల మధ్య సహకారం ప్రజాస్వామ్యవాదుల మన్ననలు పొందింది. మతోన్మాదుల స్పీడుకు బ్రేకులు వేసింది. ఈ సహకార ధోరణి కొనసాగాలని కోరుకుంటున్నారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల ప్రాధాన్యత రీత్యా బీఆర్‌ఎస్ కూడా వామపక్షాలతో కలిసి నడిచేందుకు సిద్ధపడవచ్చు. అది సాధ్యం కానప్పుడు సహజంగానే సీపీఐ-సీపీఐ(ఎం) కలిసి నడుస్తాయి. ఏం జరుగనున్నదో వేచి చూడవల్సిందే.
ఎస్. వీరయ్య
Related posts: