తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఎవరో..?

– మళ్ళీ రచ్చకెక్కిన పిఏసిఎస్
– ఆందోళనలో సొసైటీ సభ్యులు
నవ తెలంగాణ మల్హర్ రావు.
గత నాలుగు సంవత్సరాలుగా తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము అవినీతి, అక్రమాల ఆరోపణలలో కొట్టుమిట్టులాడుతొంది.2017-18lలో రైతుల,ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగానికి గురైనట్లుగా ఆరోపణలు రావడంతో అప్పటి అధికారులు విచారణ చేపట్టి సొమ్మును రికవరీ చేశారు.2019 కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల్లో రైతులు ధాన్యం విక్రయించిన,ఎరువుల సొమ్మును భారీగా చైర్మన్, సిబ్బంది అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో అప్పటి సిఈఓ, ఆపరేటర్,చైర్మన్ సస్పెండ్ అయ్యారు.51వ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వైస్ ఛైర్మన్ కు ఇంచార్జి చైర్మన్ గా అధికారులు బాధ్యతలు అప్పగించారు. మాజీ ఛైర్మన్ ఈ నెల 16న హైకోర్టు ఆర్డర్ వచ్చిందంటూ చైర్మన్ కుర్చీలో కూర్చున్నాడు.లేదు ఆర్డర్ వస్తే అధికారులకు,పాలక వర్గానికి తెలియదా.? అంతా వట్టిదే అంటూ ప్రస్తుత చైర్మన్ ఆరోపణలు చేస్తూ బుధవారం పిఏసిఎస్ కార్యాలయంలో రచ్చరచ్చయింది.ఈ విషయంపై అధికారులు ఏమి చేయాలో తెలియక సతమతమవుతున్నారు.చైర్మన్ నేనే..?, లేదు నేనే…అంటూ ఇరువురు పొట్లాడటం కొసమెరుపు.ఆ ఇద్దరు అధికారపార్టీ బిఆర్ఎస్ కు చెందిన వారే కావడం మరో విశేషం.?

Spread the love