మంచి నిద్ర ఎందుకు అవసరం?

మంచి నిద్ర
ఎందుకు అవసరం?ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మంచి నిద్ర చాలా అవసరం. పెద్దలకు, సగటున ప్రతి రోజూ రాత్రి 7, 8 గంటల నిద్ర అవసరం. ఆదమరచి నిద్ర పోవడంవల్ల రోజంతా చేసిన శ్రమ, కలిగిన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాం. నిద్ర మెదడుకు విశ్రాంతి, రికవరీ కాలాన్ని అందిస్తుంది.
మానసిక స్థితి నియంత్రణకు, మొత్తం మానసిక ఆరోగ్యానికి అవసరమైన సెరోటోనిన్‌, డోపమైన్‌, నోర్‌పైన్‌ఫ్రైన్‌ వంటి మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్‌ల సమతుల్యతను కాపాడుకోవడానికి నిద్ర చాలా కీలకం.
మెదడును డిటాక్స్‌ చేస్తుంది..
నిద్రలో, గ్లింఫాటిక్‌ వ్యవస్థ మరింత చురుకుగా మారుతుంది. రోజంతా మెదడులో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు, టాక్సిన్‌లను తొలగిస్తుంది.
హార్మోన్ల నియంత్రణ..
గ్రోత్‌ హార్మోన్‌, కార్టిసాల్‌, మెలటోనిన్‌ వంటి హార్మన్ల విడుదలను నిద్ర ప్రభావితం చేస్తుంది. ఇవి పెరుగదల, ఒత్తిడి ప్రతిస్పందన, నిద్ర మేల్కొనే చక్రం సహా వివిధ శారీరక విధులలో కీలక పాత్ర పోషిస్తాయి.
రోగనిరోధక పనితీరు..
తగినంత నిద్ర ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. శరీరాన్ని అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. నిద్రలేమి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.
న్యూరోజెనిసిస్‌..
మెదడులోని కొన్ని ప్రాంతాలలో కొత్త న్యూరాన్‌ల ఏర్పాటును ప్రోత్సహించడంలో నిద్ర ఒక పాత్ర పోషిస్తుందని, మెదడు ప్లాస్టిసిటీకి దోహదపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
నరాల సంబంధిత రుగ్మతల ప్రమాదం తగ్గుదల
దీర్ఘకాలిక నిద్ర లేమి వల్ల అల్జీమర్స్‌ వ్యాధి, పార్కిన్సన్స్‌ వంటి న్యూరోడెజెనరేటివ్‌ డిజార్డర్స్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మంచి నిద్ర ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Spread the love