రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు గాయాలు

Wife dies in road accident, husband injured– మరో ఇద్దరికీ గాయాలు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
భార్య భర్తలు కలిసి ద్విచక్ర వాహనం పై వేళ్తుండగ ప్రమాదం రూపంలో ఒక లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తా గాయాలు పాలై చికిత్స పొందుతున్నారు. ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్నారం  గ్రామానికి చెందిన కుర్మా  చిన్న బుజ్జి మల్లయ్య భార్య గంగవ్వ (68) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్ హెచ్ ఓ మనోజ్ కుమార్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం భార్య, భర్త కలిసి తమ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా జాతీయ రహదారి 44  గన్నారం యు  టర్న్  దగ్గరకు రాగానే వెనుకనుండి వస్తున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం వల్ల మల్లయ్య కు అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. గంగవ్వా  హాస్పిటల్ కి చేరుకునేలోపే మార్గ మధ్యంలో మృతి చెందినట్లు ఎస్ హెచ్ ఓ మనోజ్ కుమార్ వివరించారు. మృతురాలి కుమారుడు మల్లేష్ ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మర్చూరికి తరలించినట్లు ఎస్ హెచ్ ఓ తెలిపారు.
Spread the love