– రేవంత్‌పై నిషేధం విధించండి…
– ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఆయనపై నిషేధం విధించాలని బీఆర్‌ఎస్… ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను ఆ పార్టీ ప్రతినిధులు సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. రేవంత్ తమ పార్టీ కార్యకర్తలను దుర్భాషలాడుతున్నారంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన దాడులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిని కనీసం ఖండించకుండా కామెడీ చేస్తున్నారని వాపోయారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి వంశీకష్ణ దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడే ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోవాలంటూ బీఆర్‌ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమా భరత్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.