స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి

కార్పొరేటర్‌ విజరుకుమార్‌ గౌడ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట
స్థానిక సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తున్నానని అంబర్‌పేట కార్పొరేటర్‌ ఇ.విజరు కుమార్‌ గౌడ్‌ అన్నారు. సోమవారం అం అంబర్‌పేట డివిజన్‌ పరిధిలోని ప్రేమ్‌ నగర్‌లో స్థానిక అధికారులతో కలి సి ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా స్థానిక బస్తీ ప్రజలు మాట్లాడుతూ నాలాలో మట్టిని తొలగించాలని కార్పొరేటర్‌ దష్టికి తీసుకురావడం తో వెంటనే స్పందించిన కార్పొరేటర్‌ సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే నాలాలో పూడిక తీత పనులు వేగవంతంగా చేయాలని, రానున్న వర్షాకాలాన్ని దష్టిలో పెట్టుకొని వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మహేష్‌ ముదిరాజ్‌,గోల్డ్‌ శ్రీను,సద్దాం,సంతోష్‌ చారి తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love