నవతెలంగాణ – కంఠేశ్వర్
పట్ట భద్రుల ఎం ఎల్ సి ఎన్నికల సందర్భంగా కరీం నగర్ మాజీ మేయర్ న్యాయవాది రవింధర్ సింగ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ మంగళవారం సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా న్యాయవాదులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. రాబోయే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్ట బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకోవాలని ఎం ఎల్ సి ఎ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు తెలిపారు న్యాయవాదుల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని న్యాయవాదుల సంక్షేమం కొరకు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు న్యాయవాదుల హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు కోసం కృషి తోపాటునిరుద్యోగ నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి చేస్తానని పేర్కొన్నారు తనకు మద్దతు తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, సీనియర్ న్యాయవాదులు రాజ్కుమార్, బండారి కృష్ణ ఆనంద్, ఆర్ జగదీశ్వర్ రావు, పిడుగు రవిరాజ్, పడగల వెంకటేశ్వర్, చింతకుంట సాయి రెడ్డి, మధుసూదన్ రావు, రత్నాకర్ రెడ్డి, మంజీత్ సింగ్, బండారు నరసయ్య, డేవిడ్, మాణిక్ రాజ్, ఆశా నారాయణ ,భానుచందర్, విశ్వక్ సేన్ రాజ్ , తదితరులు పాల్గొన్నారు.