మండలంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం..

నవతెలంగాణ – జుక్కల్

ప్రపంచ పర్యవరణ దినోత్సవం ప్రతి ఎటా జూన్ 5వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం జర్గుతుంది. ఈ సంధర్భంగా జుక్కల్ ఎంపీడీఓ  శ్రీనివాస్ మండలంలోని బస్వాపూర్,  పెద్ద ఎడ్గి గ్రామాలను సందర్శించారు. మండల వాసులకు ప్రపంచ పర్యవరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలుయ చేసారు. జాతీయ ఉపాదీహమీ పనులను పరీశీలించారు. బస్వాపూర్ అమృత్ సరోవర్ వద్ద గ్రామస్తులతో కలిసి ఎంపీడీఓ శ్రీనివాస్ మెుక్కలను నాటారు. ప్రతి ఒక్కరు చెట్లను కాపాడుకోవాలని, పర్యవరణం సమతుల్యంగా ఉంటనే మానవ జాతికి మనుగడ ఉంటుందని అయన అన్నారు. ప్రపంచంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైనందున పర్యవరణానికి ముప్పు వాటిల్తుతుందని , ప్లాస్టిక్ వాడ వద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ , పెద్ద ఎడ్గి ఎఫ్ఎ అస్పత్ వార్ సుభాష్ ,  జీపీ  కార్యదర్శి రమ్ష్ చారీ , ఉపాదీహమి కూలీలు తదితరులు పాల్గోన్నారు.
Spread the love