టీఎస్‌పీఎస్సీ వైఫల్యంపై 14న రాస్తారోకో

Write on 14th on TSPSC failure– అఖిలపక్ష పార్టీల పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీఎస్‌పీఎస్సీ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి, యువజనులు, నిరుద్యోగులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి, టీఎస్‌పీఎస్సీ వైఫల్యంపై చర్యలు తీసుకోవాలనీ, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 14న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపునిచ్చాయి. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేఎస్‌ అధినేత కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించారు. మల్లు రవి (కాంగ్రెస్‌), టి సాగర్‌ (సీపీఐఎం), విశ్వేశ్వరరావు (టీజేఎస్‌), యూసఫ్‌ (సీపీఐ), ఎం హన్మేశ్‌ (సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా), జెవి చలపతిరావు (సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ), సాదినేని వెంకటేశ్వరరావు (సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ), కన్నెగంటి రవి (తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ), కిరణ్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), అనిల్‌ (పీడీఎస్‌యూ), మహేష్‌ (పీడీఎస్‌యూ), రియాజ్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో ప్రజలందరూ విద్యార్థులు, యువతకు మద్దతుగా పాల్గొనాలని కోరారు.
రాస్తారోకో కార్యక్రమ వివరాలు :
మహబూబ్‌ నగర్‌ నుంచి హైదరాబాద్‌ రహదారిలో మహబూబ్‌ నగర్‌, జడ్చర్ల, షాద్‌ నగర్‌, శంషాబాద్‌ వరంగల్‌ నుంచి
హైదరాబాద్‌ రహదారిపై వరంగల్‌, స్టేషన్‌ ఘనపూర్‌, జనగామ, ఆలేరు, భువనగిరి, ఘట్‌కేసర్‌ రామగుండం నుంచి
హైదరాబాద్‌ రహదారిపై రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్‌, సిద్ధిపేట, గజ్వేల్‌, శామీర్‌పేట, తూంకుంట ఖమ్మం నుంచి
హైదరాబాద్‌ రహదారిలో ఖమ్మం, కూసుమంచి, సూర్యాపేట, నకిరేకల్‌, నార్కట్‌పల్లి, చిట్యాల, చౌటుప్పల్‌, హయత్‌ నగర్‌
రాస్తారోకో డిమాండ్లు :3.
టీఎస్‌పీఎస్సీ ప్రస్తుత బోర్డు చైర్మెన్‌తో సహా సభ్యులను తొలగించి, చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కొత్త సభ్యులను నియమించాలి.
టీఎస్‌పీఎస్సీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి.
డీఎస్సీ పోస్టుల సంఖ్యను ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13,086కు పెంచాలి. (బ్యాక్‌లాగ్‌ పోస్టులు కాకుండా అదనంగా)
పరీక్షల రద్దుకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బాధ్యత వహించి పరీక్షలు రాసిన అభ్యర్థులకు రూ.మూడు లక్షల పరిహారం చెల్లించాలి.

Spread the love