wtc-2023: నేడు పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య పోరు

నవతెలంగాణ- హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ రోజు రెండవ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు హైదరాబాద్ వేదిక కానుంది.  ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. నెదర్లాండ్స్ తో పోలిస్తే పాకిస్తాన్ అన్ని విభాగాలలో చాలా బలంగా కనిపిస్తోంది. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని భారీ స్కోర్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకుంటే ఆ జట్టు విజయం సాధిస్తుందని కూడా చెబుతున్నారు. కాగా వామాప్ మ్యాచ్లలో పాకిస్తాన్ ఘోర పరాజయాలను చవిచూసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇంగ్లడ్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Spread the love