65 ఏళ్ల హార్ట్ పేషంట్ కు సరికొత్త జీవితాన్ని అందించిన యస్- ఐసిడి

నవతెలంగాణ: హైదరాబాద్, మే 18, 2023: మధుమేహంతో పాటు క్రోనిక్ కిడ్నీ డిసీజ్ (CKD) బాధపడుతున్న 65 ఏళ్ల రోగి… ఒకరోజు ఆస్పత్రిలో హీమోడయాలసిస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆయనకు సడన్ కార్డియాక్ అరెస్ట్ (SCA) వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వైద్య సిబ్బంది అప్పటికప్పుడు ఆయనకు కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) చేసి ప్రాణాలు కాపాడారు. సంఘటన జరిగింది ఆస్పత్రిలో కాబట్టి… వైద్య సిబ్బంది క్షణాల్లో స్పందించి సహాయం అందించడం వల్ల ప్రాణం నిలబడింది. అయితే రాబోయే రోజుల్లో ఆయనకు మరోసారి గుండె పోటు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఆ 65 ఏళ్ల రోగిని హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ బ్రాంచ్ క్లినికల్ డైరెక్టర్, డాక్టర్ వి. రాజశేఖర్, MD, DM(Cardiology), సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ & ఎలెక్ట్రోఫిజియాలజీ గారికి రిఫర్ చేశారు. సడన్ కార్డియాక్ అరెస్ట్ ను (SCA) తగ్గించేందుకు S-ICDని రోగిని అమర్చాలని ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ గారు సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా, డయాలసిస్ రోగుల మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణం. కిడ్నీ బాగా పని చేయనప్పుడు, అది రక్తాన్ని సమర్థవంతంగా శుద్ధి చేయలేదు. తద్వారా ఇది గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 700 మిలియన్ల మంది ప్రజలు CKDతో బాధపడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కుంటున్న రోగులకు అత్యవసర చికిత్స అవసరమవుతుంది. ఎందుకంటే ఇది ప్రాణాంతకం. అంతేకాకుండా మూత్రపిండాల వైఫల్యం వల్ల ఇన్ఫెక్షన్, రక్తహీనత, ఎముకల వ్యాధి, గుండె సంబంధిత సమస్యలకు లాంటి ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారి తీయవచ్చు, వీటిలో అత్యంత ప్రధానమైది మరియు ప్రాణాంతకమైనది గుండెపోటు.
ఈ సందర్భంగా డాక్టర్ వి రాజశేఖర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, “రోగికి ఉన్న వైద్య చరిత్ర కారణంగా ఆయనకు సడన్ కార్డియాక్ అరెస్ట్ (SCA) వచ్చింది. రోగికి అప్పటికే డయాలసిస్ కోసం పెర్మ్‌ క్యాత్ ఉంది. అలాగే AV ఫిస్టులాను రూపొందించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, డయాలసిస్ కోసం నరం దొరకలేదు. ఇలాంటి సందర్భాలలో కేసు కష్టంగా లేకపోతే… ఒక ప్రామాణిక ICD సూచించాలి. కానీ సిరల్లో ఎలక్ట్రోడ్ వైర్‌లను అమర్చడం వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల రోగికి S-ICD ఇంప్లాంట్ చాలా అవసరం అని గుర్తించడం జరిగింది. దీనివల్ల ఇంట్రావీనస్ లీడ్స్ వల్ల వచ్చే సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి.”
S-ICD అనేది గుండె గదులు లేదా వాస్కులేచర్‌ను తాకకుండా SCA నుండి రోగిని రక్షించే ఒక ప్రత్యేకమైన పరికరం. ట్రాన్స్‌ వీనస్ ICDలా, S-ICD సిస్టమ్ ప్రాణాలను రక్షించే పల్స్ జనరేటర్‌ను ఉపయోగిస్తుంది. ట్రాన్స్‌ వీనస్ ICDలా కాకుండా, S-ICD సిస్టమ్ సబ్‌కటానియస్ ఎలక్ట్రోడ్‌ను ఉపయోగిస్తుంది. ECG పరీక్ష గుండె కొట్టుకునే విధానాన్ని విశ్లేషిస్తుంది. అంటే గుండె ప్రాణాంతకంగా కొట్టుకోవడం నుంచి సాధారణంగా పనిచేసే స్థాయికి తీసుకువస్తుంది. ఇది హృద్రోగ సమస్య ప్రారంభంలో ఉన్న రోగులకు చాలా ముఖ్యమైనది. దీనికి ఆయుర్దాయం ఎక్కువ. అధ్యయనాల ప్రకారం, 40 శాతం వరకు శరీరంలో ఉండే సిరలు 10 సంవత్సరాల వ్యవధిలో అరిగిపోతాయి. అందువల్ల, ఇంప్లాంట్ సమయంలో రోగి ఎంత చిన్నవాడు అయితే సిరలు పనిచేయకుండా పోయే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది.
“ఇది తక్కువ-రిస్క్ అయిన వంటి చికిత్స కావడంతో రోగి కోలుకోవడం వేగంగా ఉంటుంది. అలాగే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం చాలా తక్కువ. ఆపరేషన్ విజయవంతం అవ్వగానే, రోగి వెంటనే నడవగలుగుతాడు. రోజువారీ పనులను డాక్టరు సలహాతో చేసుకోవచ్చు. S-ICD పల్స్ జనరేటర్ల ద్వారా కార్డియాక్ అరిథ్మియాను పర్యవేక్షణ మరియు నిర్వహణను చూసుకుంటుంది. దీనికి తక్కువ ఇన్ఫెక్షన్ రేటు ఉండడంతో… ఈ ఇంప్లాంట్లు అనేక గుండె జబ్బులు లేదా గుండెను ప్రభావితం చేసే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రామాణిక చికిత్సగా మారుతుందని అన్నారు డాక్టర్ రాజశేఖర్ గారు.

Spread the love