వ్యాపారులను బలోపేతం చెయ్యడానికి మై బిల్ మెగా అప్ డేట్

నవతెలంగాణ-హైదరాబాద్: చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాల్లో (SMBలు) అక్కౌంటింగ్ పరిష్కారాల కోసం భారతదేశపు ప్రముఖ జీఎస్టీ బిల్లింగ్ మరియు అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అయిన myBillBook అద్భుతమైన మెగా అప్ డేట్ ను అందిస్తోంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాన్ని సులువుగా నిర్వహించేందుకు వీలుగా తన ఫ్లాట్ ఫార్మ్ లో 10 అద్భుతమైన కొత్త ఫీచర్లను ప్రారంభించింది myBillBook. వ్యాపారాన్ని మరింత సులభంగా మరియు సమర్ధవంతంగా నిర్వహించడంలో చిన్న మధ్య తరహా వ్యాపారాలకు సహాయం చేయడానికి ఈ కొత్త ఫీచర్లు రూపొందించబడ్డాయి. ఇవి ఇన్‌వాయిస్, అకౌంటింగ్, పేరోల్, మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ అవసరాలను నిర్వహించడానికి సమగ్రమైన సాధనాలను అందిస్తాయి. ఈ చేర్పులతో, myBillBookఅనేది చిన్న, మధ్య తరహా వ్యాపారాల కోసం వన్-స్టాప్ సొల్యూషన్‌గా దాని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. అంతేకాకుండా కొన్ని క్లిష్టమైన కార్యకలాపాలను పరిష్కరించడానికి మరియు భారతదేశంలోని వ్యాపారాలు అన్నీ డిజిటలైజేషన్‌ను ప్రారంభించేందుకు ఈ యాప్ ఎంతో దోహదపడుతుంది.

మూడేళ్ల కిందట ప్రారంభమైన ఫ్లోబిజ్ వారి మైబిల్ సాఫ్ట్వేర్ యాప్ బుక్ దేశంలోని 70 లక్షల వ్యాపారులకు డిజిటలైజేషన్ ద్వారా తమ రోజువారీ కార్యకలాపాల్ని ఎక్కడి నుంచి అయినా నిర్వహించడానికి సహాయపడుతుంది. కస్టమర్ కే తొలి ప్రాధాన్యం లక్ష్యంతో రూపొందించిన మై బిల్ బుక్.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పాటు.. డెస్క్‌టాప్‌లో కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు, దీన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు, ఏ పరిస్థితుల్లోనైనా వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. జీఎస్టీ/నాన్-జీఎస్టీ బిల్లింగ్, ఈ-వే బిల్లింగ్, పిఓఎస్ బిల్లింగ్, ఈ-ఇన్‌వాయిసింగ్ వంటి అధునాతన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మైబిల్ బుక్ యాప్ తో ప్రతి నెలా చిన్న-మధ్య తరహా వ్యాపారాలు ఇప్పటికే రూ. 12,500 కోట్ల విలువైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.

myBillBook ద్వారా పరిచయం అయిన కొత్త ఫీచర్స్ అన్నీ కంపెనీ లక్ష్యం అయినటువంటి “బిల్టింగ్ ఫర్ భారత్ ” నినాదానికి అనుగుణంగా రూపొందించబడ్డాయి. ఈ ఫీచర్‌లు భారతీయ చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు సరిపోయే విధంగా రూపొందించబడ్డాయి. దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. అంతేకాకుండా ఇది శక్తివంతమైనది, వివిధ రకాల వినియోగ అవసరాలను తీరుస్తుంది. ఇక ఇందులో ఉన్న ప్రధాన ఫీచర్స్ ని ఒకసారి గమనిస్తే…

వాట్సాప్ మార్కెటింగ్: వినియోగదారులు ఇప్పుడు వాట్సాప్‌లో బల్క్ మార్కెటింగ్ క్యాంపెయిన్‌ల ద్వారా తమ వ్యాపారాలను ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ ప్రచారాల పెట్టుబడిపై రాబడిని (RoI) విశ్లేషించవచ్చు. ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న సులభమైన టెంప్లేట్‌లు చిన్న వ్యాపార యజమానులు ఇచ్చే డిస్కౌంట్‌లు, ప్రమోషన్‌లు, సీజనల్ సేల్స్ మరియు పండుగలు వంటి వివిధ కార్యకలాపాలను ప్రకటించడానికి మరియు ప్రచారం చేయడానికి వీలు కల్పిస్తాయి.
స్టాఫ్ అటెండెన్స్ మరియు పేరోల్ మేనేజ్‌మెంట్: ఇది ఒక ప్రత్యేకమైన ఫీచర్. వ్యాపార యజమానులు తమ ఉద్యోగుల హాజరును గుర్తించడానికి, ముందస్తు చెల్లింపులను చేయడానికి మరియు సిబ్బంది పేరోల్‌ని నిర్వహించడానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తుంది.
ఆటోమేటెడ్ బిల్లులు: చిన్న, మధ్య తరహా వ్యాపారులు ఇప్పుడు తమ క్లయింట్‌లకు రిటైనర్-రకం సేవల కోసం పునరావృత ఇన్‌వాయిస్‌లను సెటప్ చేయగలవు. తద్వారా ప్రతి నెలా మాన్యువల్ గా ఇన్‌వాయిస్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది వ్యాపార యజమానులకు చాలా సమయాన్ని మాత్రమే కాకుండా లోపాలు మరియు వ్యత్యాసాలను తొలగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం వినియోగదారులకు అందించాల్సిన సేవలు, ఫ్రీక్వెన్సీ మరియు రిమైండర్ షెడ్యూల్‌ను సెట్ చేయాల్సి ఉంటుంది.తద్వారా ఈ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ప్రొఫెషినల్ ఇన్‌వాయిస్‌లను ఉత్పత్తి చేయడం,వినియోగదారులు మరియు క్లయింట్‌లకు షేర్ చేయడం లాంటివి చేస్తుంది.
json ఫార్మాట్ లో జీఎస్టీఆర్: వినియోగదారులు 25 ముఖ్యమైన రిపోర్ట్స్ తో పాటు జీఎస్టీ పోర్టల్‌కి సులభంగా అప్‌లోడ్ చేయడానికి లేదా అక్కౌంటెంట్స్ తో భాగస్వామ్యం చేయడానికి json ఫార్మాట్‌లో వారి జీఎస్టీఆర్1 ఫైల్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ఈ-మెయిల్ చేయవచ్చు.
మొబైల్‌లో ఈ-వే బిల్లులను జనరేట్ చేయడం: ఈ తాజా ఫీచర్ వినియోగదారులకు మొబైల్ ఫోన్‌లలో ఈ-వే బిల్లులను రూపొందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటివరకు myBillBookయొక్క వెబ్ యాప్‌లో అందుబాటులో ఉంది. రీసెంట్ గా మొబైల్ యాప్ లో కూడా ఈ ఫీచర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ బిల్ జనరేషన్ ప్రాసెస్‌ను పూర్తిగా ఆటోమేటెడ్ చేస్తుంది. అలాగే వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌ల నుండే తమకు నచ్చిన పార్టీలకు ఎర్రర్-ఫ్రీ ఈ-వే బిల్లులను పంపవచ్చు.
బ్యాలెన్స్ షీట్: ఈ కొత్త ఫీచర్ తో, చిన్న, మధ్య తరహా వ్యాపారస్థులు ఇప్పుడు నేరుగా myBillBookలో బ్యాలెన్స్ షీట్‌లను రూపొందించవచ్చు. తద్వారా వ్యాపార అభివృద్ధి మరియు ఆర్థిక పరిస్థితిపై సమగ్రమైన అవగాహన కలిగి ఉంటారు.
కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (CRM): వినియోగదారులు, కొనుగోలుదారులు మరియు విక్రేతలకు సర్వీస్ రిమైండర్‌లను సెట్ చేయవచ్చు మరియు పంపవచ్చు, అలాగే రాబోయే అపాయింట్‌మెంట్‌ల కోసం నోటిఫికేషన్‌లను సెట్ చేయవచ్చు. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు పుట్టినరోజు రిమైండర్‌ల వంటి ఫీచర్‌లు కూడా ఇందులో చేర్చబడ్డాయి.
లాయల్టీ కార్యక్రమాలు: వ్యాపార యజమానులు ఇప్పుడు లాయల్టీ పాయింట్‌లను నేరుగా భవిష్యత్ కొనుగోళ్లపై తగ్గింపులుగా మార్చడం ద్వారా వినియోగదారులను దీర్ఘకాలికంగా నిలుపుకోవచ్చు. ఇందుకోసం వినియోగదారులకు లాయల్టీ ప్రోగ్రామ్‌లను సెటప్ చేయవచ్చు.దీనిద్వారా కొనుగోలు తర్వాత వారికి ఇవ్వాల్సిన పాయింట్లు వారికి ఆటోమేటిగ్గా చేరిపోతాయి. ప్రత్యేకమైన లాయల్టీ ప్రోగ్రామ్‌లు ఇప్పటికే ఉన్న క్లయింట్‌లతో తమ సంబంధాన్ని మెరుగుపరుస్తాయి. అదే కొత్త వినియోగదారులు అయితే వారిని మరింతగా ఆకర్షిస్తాయి.
మల్టీ బ్యాంక్ అకౌంట్స్: వినియోగదారులు ఇప్పుడు మల్టీ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా చెల్లింపులను సులభంగా చేయవచ్చు. తద్వారా ఏఏ ఖాతాల నుంచి లావాదేవీ జరిగింది, ఎంత మొత్తం బయటకు వెళ్లింది, ఎంత మొత్తం వచ్చింది లాంటి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

10. డేటా ఎక్స్ పోర్ట్ టు ట్యాలీ: వినియోగదారులు తమ డేటా మరియు రిపోర్టులను నిర్వహించడాన్ని సులభతరం చేస్తూ, ప్రముఖ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అయిన Tallyకి మొత్తం myBillBookడేటాను చాలా సింపుల్ గా ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు.

“ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీతో పాటు కొత్తగా వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వ్యాపారుల అవసరాలను అర్థం చేసుకోవడం చాలా అత్యవసరం. తద్వారా వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వ్యాపారాలను నిర్వహించుకోగలుగుతారు. మైబిల్‌బుక్‌లో ఈ కొత్త ఫీచర్‌లను ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఇవి గేమ్-ఛేంజర్‌గా నిరూపిస్తాయని గట్టిగా నమ్ముతున్నాము. మా వినియోగదారులు, ఇన్‌వాయిసింగ్, రిపోర్ట్స్, ఇన్వెంటరీ మేనేజ్ మెంట్, చెల్లింపులు మరియు అకౌంటింగ్‌కు సంబంధించిన ప్రధాన కార్యాచరణలతో పాటు, మైబిల్‌బుక్ ఇప్పుడు కస్టమర్ ఎంగేజ్‌మెంట్, మార్కెటింగ్, స్టాఫ్ మేనేజ్‌మెంట్ మరియు లాయల్టీ కోసం ఫీచర్లను కూడా అందిస్తుంది. myBillBook అనేది వ్యాపార అభివృద్ధికి వన్-స్టాప్ సొల్యూషన్ గా మారింది. ఇది కంప్లీట్ సాఫ్ట్‌ వేర్ మేనేజ్ మెంట్ ప్రక్రియలను సులభతరం చేస్తుంది. వ్యాపార సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది” అని అన్నారు ఫ్లోబిజ్ సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు రాహుల్ రాజ్.

myBillBook లోప్రవేశపెట్టిన స్ట్రీమ్‌లైన్డ్ సీఆర్ఎమ్, సర్వీస్ రిమైండర్‌లు,వాట్సాప్ మార్కెటింగ్ ద్వారా వినియోగదారులు తమ కస్టమర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచుకోవడంలో సహాయపడతాయి. సిబ్బంది హాజరు మరియు పేరోల్ నిర్వహణ కోసం ఫీచర్ల జోడింపు, బ్యాలెన్స్ షీట్‌లను అందించడం,జేఎస్ఓఎన్ ఫార్మాట్‌లో జీఎస్టీఆర్ వంటి అకౌంటింగ్ ఫీచర్‌లలో పురోగతి, బలమైన మొబైల్-ఫస్ట్ సొల్యూషన్‌లను రూపొందించడం లాంటి ఫీచర్లు చిన్న మధ్య తరహా వ్యాపారాల్లో డిజిటలైజేషన్ వేగవంతం చేయడానికి దోహదపడతాయి. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ ను నిర్మించాలన్నలక్ష్యానికి మరింతగా చేరువ అవుతాం.

myBillBook గురించి:చిన్న, మధ్య తరహా వ్యాపారస్థులు తమ కార్యకలాపాలను ఎక్కడి నుండైనా &ఎప్పుడైనా నిర్వహించడంలో సహాయపడటానికి రూపొందించబడిందే ఈ myBillBook. ఇది మొబైల్ &డెస్క్‌టాప్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. వ్యాపార యజమానులు రోజు వారి ప్రయాణంలో లావాదేవీలను రికార్డ్ చేయడానికి, వ్యాపార పనితీరును ట్రాక్ చేయడానికి సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో ప్రధాన వ్యాపార కార్యకలాపాలలో జీఎస్టీ ప్రధానమైనది. జీఎస్టీ పైలింగ్ కు ఈ యాప్ ఎంతో ఆదర్శవంతమైన సాఫ్ట్‌ వేర్. అలాగే, తమ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయాలని మరియు ఆర్థిక స్థితిని బాగా అర్థం చేసుకోవాలని చూస్తున్న వ్యాపారస్థులకు ఈ సాఫ్ట్ వేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది బిల్లులు (జీఎస్టీ& నాన్ జీఎస్టీ) మరియు ఈ-ఇన్‌వాయిస్‌లను సృష్టించడం, కొనుగోళ్లు &ఖర్చులను రికార్డ్ చేయడం, స్టాక్‌ను నిర్వహించడం, మొబైల్ ఫోన్‌లు లేదా కంప్యూటర్‌ల నుండి నేరుగా చెల్లింపులు /స్వీకరణలను నిర్వహించడంలో సహాయపడుతుంది. అలాగే, ఈ యాప్ 25కి పైగా క్లిష్టమైన వ్యాపార నివేదికలను రూపొందిస్తుంది. ఇది వ్యాపార యజమానులకు సమర్థవంతమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. myBillBookప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ &తమిళ భాషలలో అందుబాటులో ఉంది.

Spread the love