నీవు నన్ను…!

నీవు నన్ను ప్రేమిస్తే
జగాన్నంతా జయించినట్లే

నీవు నన్ను కాదంటే
లోకమంతా చీకటే

నిన్ను తప్ప నా కనులు
మరేమీ చూడనని మారాం

నీవు లేని జీవతం
అంతా శూన్యమే

నీతో ఆ పాతాళమయినా
నా పాలిట స్వర్గమే

నీవు లేని వైకుంఠమైనా
పాడు పడిన దుర్గమే

నీవు నన్ను వలదన్నా
నా ప్రేమ నిను వీడదే

నీవు నన్ను వీడితే
నాకు ఊపిరాడదే

– యలమర్తి అనూరాధ
హైద్రాబాద్
9247260206

Spread the love