నవతెలంగాణ – మిరు దొడ్డి
మిరుదొడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2003- 04 విద్యా సంవత్సరంకు చెందిన పదవ తరగతి విద్యార్థులు గురువారం తమ ఔదార్యాన్ని చాటి స్ఫూర్తిగా నిలిచారు. తమతో చదువుకున్న స్నేహితులు నలుగురు వివిధ కారణాలతో మృతి చెందారు. తోటి స్నేహితుల కుటుంబాలకు అండగా నిలవాలనుకున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా రూ. 20 వెలను సేకరించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5వేలు చొప్పున నాలుగు బాధిత కుటుంబాలకు అందజేశారు. భవిష్యత్తులో ఆ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు స్వామి కనకరాజు రమేష్ పరశురాములు మధు రాజు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.