రాజకీయాలలో యువతరం హవా

– వ్యూహకర్తలుగా రాణిస్తున్న యువ నాయకులు
– ప్రధాన పార్టీలను ముందుండి నడిపిస్తున్న వైనం
నవతెలంగాణ-ముషీరాబాద్‌
ముషీరాబాద్‌ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల నుంచి నిన్నటి పార్లమెంట్‌ ఎన్నికల వరకు రాజకీయాలలో యువత పెద్ద ఎత్తున పాల్గొని ఎన్నికల ప్రచారం నుంచి మొదలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు వ్యూహాలు రచిం చడంలో ముందున్నారు. ముఖ్యంగా అన్ని ప్రధాన పార్టీలు అయినటు వంటి కాంగ్రెస్‌, బీజేపీలలో యువతరం నాయ కులు ముందుండి అన్నీ తామై ముందుండి నడిపిస్తున్నారు. వారి దూకుడుకు సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు కూడా మెచ్చుకోక తప్పని పరిస్థితి వ్యూహకర్తలుగా రాణిస్తున్న ప్రధాన పార్టీ యువ నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్న ముఠా గోపాల్‌ తనయుడు ముఠా జయసింహ, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కుమారుడు అరవింద్‌ యాదవ్‌ (టిల్లు), బీజేపీ నుంచి యువ నాయకులు సుబ్రహ్మణ్య శర్మ ముందు వరుసలో ఉంటారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు శక్తి వంచన లేకుండా కషి చేస్తున్నారు. ఎన్నికలు ఏవైనా తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు.

బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు ముఠా జై సింహా..
ముందుగా యువ నాయకుడుగా పేరొంది న ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ తన యుడు ముఠా జైసింహ తండ్రికి తగ్గ తన యుడుగా రాజకీయాలలో దూసుకుపోతు న్నాడు. దూకుడు స్వభావం రాజకీయ వ్యూహాం లో జై సింహ దిట్ట తన రాజకీయ చతురతతో తన తండ్రిని రెండు పర్యాయాలు ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని కొన్ని సందర్భాల్లో తండ్రి తనయుడి సలహాలు అడగడం చూస్తుంటే జైసింహ ఏ విధంగా వ్యూహాలు రచిస్తారో తెలుస్తుంది. కొన్ని పరిస్థితులలో పార్టీ సీనియర్‌ నాయకులు ఉద్యమకారులను పట్టించుకోవడం లేదనే విమర్శ ఉన్న అందరినీ కలుపుకుని వెళ్లే స్వభావం కలవాడై తండ్రికి తగ్గ తనయుడుగా ముషీరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తూ సత్తా చాటుతున్నారు. ప్రస్తుత రాజకీయాలలో విమర్శలు సర్వసాధారణం తండ్రి తర్వాత ముషీరాబాద్‌ ఎమ్మెల్యే స్థానంపై గురిపెడుతూ ఆదిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రజలను ఆకర్షిస్తూ కాబోయే యువ ఎమ్మెల్యేగా రాణించాలన్నదే ముఠా జయసింహ ప్రస్తుత లక్ష్యంగా కనబడుతుంది.

కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకుడు అరవింద్‌ కుమార్‌యాదవ్‌ (టిల్లు)
కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ చిన్న కుమారుడు అయినటు వంటి కాంగ్రెస్‌ యువ నాయకుడు అరవింద్‌ కుమార్‌ యాదవ్‌ (టిల్లు) ప్రస్తుత రాజకీయాలలో దూసుకుపోతు న్నారు. ముఖ్యంగా తెరవెనక రాజకీయాలు చేయడంలో వ్యూహాత్మక అడుగులు వేయడంలో నేర్పరి.. తన అన్న అంజన్‌ కుమార్‌యాదవ్‌ పెద్ద కుమారుడు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అన్న గెలుపునకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఈ ఇరువురి గెలుపునకు అరవింద్‌ యాదవ్‌ అలుపెరుగని కషి చేశారన్నది జగమెరిగిన సత్యం. గెలుపోటములు సంగతి పక్కన పెడితే అరవింద్‌ యాదవ్‌ తనదైన శైలిలో ప్రతి ఒక్క సీనియర్‌ నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేయడంలో ప్రచారంలో వ్యూహాలు పొందడంలో దిట్టగా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. రాజకీయాలలో తండ్రి అన్నలకు తోడుగా ఉంటూ ప్రస్తుత రాజకీయాల్లో దూసుకుపోతున్న అరవింద్‌ అన్న రాజ్యసభకు వెళ్లడంతో ముషీరాబాద్‌లో తనకంటూ ప్రత్యేక క్యాడర్‌ను ఏర్పరచుకొని ప్రజా సమస్యలు పరిష్కారంలో ముందు ఉంటూ ప్రజలకు మరింత చేరువై రాబోయే ఎన్నికల్లో ముషీరాబాద్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టికెట్‌కు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారు.

బీజేపీ యువ నాయకుడు (సూర్యనారాయణ శర్మ)
బీజేపీ ముషీరాబాద్‌లో కనుమరుగవుతున్న సమ యంలో పార్టీ యువ నాయకుడుగా సూర్యనారాయణ శర్మ పార్టీ పూర్వ వైభవానికి కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మూడవ స్థానంలో ఉన్న బీజేపీ పార్టీని 2023 ఎన్నికల్లో పుంజుకునే విధంగా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్‌ నాయకులతో సమావేశాలు నిర్వహించి పార్టీ విధివిధానాలపై సమిష్టిగా కషి చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో సూర్యనారాయణ శర్మ విజయం సాధించారని తెలుస్తుంది. ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికల్లో కిషన్‌ రెడ్డి గెలుపునకు తీవ్రంగా శ్రమించారని క్యాంపెనింగ్‌లు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి హామీలు ఇస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ముషీరాబాద్‌లో బీజేపీ గడ్డుకాలం అనుభవి స్తున్న తరుణంలో సూర్యనారాయణ అందరినీ కలుప కుంటూ పార్టీ పూర్వ వైభవానికి కష్టపడుతున్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ముషీరాబాద్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తాను కష్టపడే విధానం ద్వారా తెలుస్తుంది.
ప్రస్తుతం అన్ని ప్రధాన పార్టీల నుంచి యువ నాయకులు దూసుకుపోవడం రాజకీయాలకు యువత రం రావాలనే నినాదానికి జీవం పోస్తున్నటు వంటి అంశం ప్రజల మన్ననలు పొందే నాయకుడే ప్రజల్లో చెరగని ముద్ర వేస్తారు. ఆ వైపుగా అడుగులు వేస్తారో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

Spread the love