యువత క్విజ్ పోటీలో పాల్గొనాలి..

– చింతా క్రాంతి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
రాజీవ్ గాంధీ అంతర్జాల క్విజ్ పోటీలలో యువత అధిక సంఖ్యలో పాల్గొని బహుమతులు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చింత క్రాంతి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని చల్వాయి గ్రామంలో ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో యువకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతాక్రాతి మాట్లాడుతూప్రియాంక గాంధీ గ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో యువత మేధస్సును వెలికితీయడానికి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల యువతకు రాజీవ్ గాంధీ అంతర్జాల క్విజ్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొనడానికి జూలై నెల ఒకటవ తారీకు వరకు మీ మొబైల్ నెంబర్ నుండి 7661899899 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వగా, ఫోనుకు ఒక లింక్ వస్తుంది. ఆ లింకును క్లిక్ చేయగా రాజీవ్ గాంధీ అంతర్జాల క్విజ్ కార్యక్రమం పేజీ ఓపెన్ అవుతుంది. ఇట్టి పేజీలో పేరు డీటైల్స్ ఎంటర్ చేసి రిఫరల్ ఐడి 1129 ఎంటర్ చేయాలని అన్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రాజీవ్ గాంధీ అంతర్జాల క్విజ్ పోటీల గురించి ఎవరి మండలంలో వారు తిరుగుతూ యువతను పోటీల్లో పాల్గొనేలా చేయాలని, యూత్ నాయకులు వారి పేర్లు ఇస్తే వారి పేర్లను నమోదు చేసి వారికి ఒక రిఫరల్ ఐడి వస్తుంది అని, వారు రిఫరల్ ఐడితో యువతను అంతర్జాలంలో కార్యక్రమంలో పేర్లు నమోదు చేయాలని సూచించారు. మన మండలంలో మూడు వేలకు తగ్గకుండా యువతను క్విజ్ కార్యక్రమంలో పాల్గొనేలా యూత్ కాంగ్రెస్ నాయకులు పని చేయాలని అన్నారు. కావున ప్రతి ఒక్క యూత్ నాయకులు కష్టపడి పని చేసి ఎక్కువమంది యువతను చేర్పించేల పని చేయాలని కోరారు. కష్టపడిన ప్రతి యూత్ నాయకుడికి తగిన గౌరవం లభిస్తుంది అని అన్నారు. ఇప్పటికే భారాస ప్రభుత్వంలో యువత చాలా నష్టపోయింది అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే యువతకు భవిత ఉంటుందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళకు ఎలక్ట్రిక్ స్కూటీ, మొదటి 40 మందికి ల్యాప్ టాపులు, స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, స్మార్ట్ వాచులు, పవర్ బ్యాంకులు, తదితర బహుమతులు గెలుచుకునే అవకాశం ఉన్నందున యువతను అధిక సంఖ్యలో చేర్పించాల్సిన బాధ్యత యూత్ నాయకులదే అని అన్నారు. కాబట్టి యువత కూడా రాజీవ్ గాంధీ అంతర్జాల క్విజ్ పరీక్షలో పాల్గొని సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపనిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, యూత్ నాయకులు చాపల కిషన్ రెడ్డి, పొన్నం సాయి, సతీష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love