
స్వామి వివేకానంద జీవనాన్ని, సాహిత్యాన్ని నేటి యువత అధ్యయనం చేయాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ లో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో ఆయన స్వామిజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడని తెలిపారు. స్వామిజీ స్వరూపమే ఒక సందేశమని, ఆయన ఆహార్యం, మాట, శరీరం, జ్ఞానం, వినయం, నేటి యువత స్పూర్తిగా తీసుకుని అడుగులు వేయాలని జగన్ కోరారు. స్వామిజీ యువతకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి పుస్తకాలు, ప్రసంగాలు చేశారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బార్ ఉపాఢ్యక్షులు పెండెం రాజు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుభేదార్,న్యాయవాదులు ఆశా నారాయణ, పడిగెల వెంకటేష్ విఘ్నేష్ ,పులి జైపాల్, అరేటి నారాయణ, రణదీశ్,సుజీత్ , సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
స్వామీజీ కి నివాళులు..
నిజామాబాద్ నగరంలోని గాజుల పెట్ లో గల స్వామి వివేకానంద విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి బార్ అసోసియేషన్ కార్యవర్గం.