నవతెలంగాణ- నసురుల్లాబాద్: నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందు పటేల్ ఆధ్వర్యంలో 40 మంది వివిధ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆదివారం కాగ్రెస్ పార్టీలో చేశారు. కాంగ్రెస్ చేపట్టిన 6 గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై, పురుషులతోపాటు మహిళలు సైతం అత్యధిక సంఖ్యలో పార్టీలో చేరినట్లు పార్టీ అధ్యక్షుడు నందు పటేల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు ప్రతి కార్య కర్త కృషి చేయాలని నందు పటేల్ సూచించారు. బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్బల్, శివప్రసాద్, సాయిలు, రవి తదితరులు పాల్గొన్నారు