నవతెలంగాణ-నిజాంపేట
రామాయంపేట రెవెన్యూ డివిజన్‌కై రామాయంపేట జేఏసీకి మద్దతుగా నిజాంపేట మండల కేంద్రం నుండి రామాయంపేట దీక్ష శిబిరం వరకు నిజాంపేట మండల జెడ్పీటీసీ పంజా విజరు కుమార్ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో దారి పొడవున ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలు కులసంఘాల నాయకులు యువకులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి జెడ్పీటీసీకి సంఘీభావం తెలిపారు. వివిధ గ్రామాలలో జెడ్పీటీసీకి తిలకం దిద్దుతూ మంగళహారతిలో ఘన స్వాగతం పలికారు. మహిళలు కోలాటం ఆడతూ, ఒగ్గు కళాకారులు డబ్బు సప్పులతో భారీ ర్యాలీగా దాదాపుగా 3,000 మంది వరకు బయలుదేరారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ పంజా విజరు కుమార్ మాట్లాడుతూ పాదయాత్రకు మద్దతు తెలిపిన రైతులకు మహిళలకు యువకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసమే ఈ పాదయాత్ర నిర్వహించామన్నారు. అడగంది అమ్మ అయినా అన్నం పెట్టేదని తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టికి రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం ఎవరు తీసుకుపోలేరన్నారు. ముఖ్యమంత్రి దష్టికి తీసుకుపోవడానికి ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకం కాదు అనిపార్టీ శ్రేయస్సు కోసం ఎల్లవేళలా పనిచేస్తూ పార్టీకి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చల్మెడ సర్పంచ్ నరసింహారెడ్డి, ధర్మా నాగరాజు, నార్ల పూర్ ఎంపిటిసి రాజిరెడ్డి, ఉప సర్పంచులుతుమ్మల రమేష్, సంజీవులు బిఆర్‌ఎస్ నాయకులు జాల పోచయ్య, జిపి. స్వామి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, తాడెం శ్రీకాంత్, గర్గుల శ్రీనివాస్,నీలం తిరుపతి,దేశెట్టి లింగం, శివ, నాలం స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ గౌడ్, యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.