నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు దోహదం

నవతెలంగాణ-శామీర్‌పేట
నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు దోహదపడ తాయని శామీర్‌పేట సీఐ సుధీర్‌ కుమార్‌ అన్నారు. మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని శామీర్‌పేట సీఐ సుధీర్‌ కుమార్‌ కోరడంతో అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ క్యాతం కృష్ణమూర్తి కుమారుడు ఉన్నత విద్యావంతులు యువ నాయకులు క్యాతం మధుక్రిష్ణ సానుకూలంగా స్పందించి సోమవారం శామీర్‌ పేట పేట సిఐ సుధీర్‌ కుమార్‌కు రు.2లక్షలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాత మధు క్రిష్ణ మాట్లాడుతూ సీఐ సూచన మేరకు సామాజిక బాధ్యతగా తను సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్ధిక సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక స్పహ కలిగి ఉంటే ఉన్నతమైన సమాజం నిర్మితమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు రవికుమార్‌, మునీందర్‌, చంద్రశేఖర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love