ఉమెన్‌ వాటర్‌ ఛాంపియన్స్‌

ఒకప్పుడు వారు గుక్కెడు నీటి కోసం నాలుగైదు కిలోమీటర్లు నడిచి వెళ్ళే వారు. మహిళలంతా తలపై కడవలు పెట్టుకొని మోయలేని భారంతో అడుగులు వేస్తూ మంచినీటిని తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. రేణుకా కోటంబ్కర్‌, అశాతై కొమ్టై, బబితా లిరోలియా, రాధా మీనా… వారి గ్రామాల్లో వాటర్‌ ఛాంపియన్‌లుగా నిలిచారు. వాటర్‌ ఎయిడ్‌ ఇండియా సహాయంతో తమ గ్రామాల్లో మంచినీటి పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ, తమ కమ్యూనిటీలలో స్థిరమైన మార్పును తీసుకురావడానికి, స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో సహాయం చేస్తున్నారు. వారు చేసిన ఈ పని వారి జీవితాల్లోనే కాదు చుట్టపక్కల గ్రామాల్లో కూడా ఎంతో మార్పు తెచ్చింది. ఆ వివరాలేంటో ఈ రోజు మానవిలో…
మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలోని కొన్ని మారుమూల గ్రామాల్లో మహిళలు ఓ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇది వారి జీవితాలనే కాదు వారి చుట్టూ ఉన్నవారిని సైతం విభిన్న మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. వీరు గతంలో మంచినీటి కోసం నాలుగైదు కి.మీ వరకు నడిచే పోయేవారు. ఇప్పుడు ఆ ఉద్యమ ఫలితంగా స్వచ్ఛమైన మంచినీరు వీరికి అందుబాటులోకి వచ్చింది. స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ వారి కమ్యూనిటీలలో స్థిరమైన మార్పును ఆ మహిళలు ముందుండి నడిపిస్తున్నారు.
మహిళలకు శిక్షణ ఇస్తూ…
వాటర్‌ ఎయిడ్‌ ఇండియా అనేది ఓ స్వచ్ఛంధ సంస్థ. గ్లోబల్‌ వాటర్‌ ఎయిడ్‌ నెట్‌వర్క్‌లో భాగమైంది. ఖూA×ణ డ +aజూ ×అష ద్వారా విమెన్‌ ం వాటర్‌ అలయన్స్‌ (‘ుష్ట్రవ ఔంఔ అలయన్స్‌) అనే ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళలకు శిక్షణనిస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలలో వాటర్‌ ఎయిడ్‌ ఇండియా తన పని చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ సామాజిక, ఆర్థిక అంశాలపై కూడా దృష్టిపెడుతుంది. ఖచీణూ ద్వారా మహిళలకు ఉమెన్‌ వాటర్‌ ఛాంపియన్స్‌ బిరుదును అందిస్తుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా వారు తమ కమ్యూనిటీలలో మార్పు కోసం కృషి చేసేలా ప్రోత్సహిస్తుంది. జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ వారి జల్‌ జీవన్‌ మిషన్‌ పరిధిలోని అన్ని కమ్యూనిటీ కార్యక్రమాలు ప్రాజెక్ట్‌ ప్రాంతాలలో చేపట్టబడతాయి.
మార్పు కోసం కృషి
వాటర్‌ఎయిడ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మాట్లాడుతూ ”విమెన్‌ ం వాటర్‌ అలయన్స్‌ అనేది ఖూA×ణ, గ్యాప్‌ ఇంక్‌ల మధ్య ఆరు సంవత్సరాల గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ అలయన్స్‌ (+ణA). 2019 నుండి ఈ అలయన్స్‌లో భాగస్వామి అయిన వాటర్‌ఎయిడ్‌ ఇండియా దానికి కట్టుబడి ఉంది. మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌, ఇండోర్‌, ధార్‌, దేవాస్‌ఖాండ్వా జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని వార్ధా, యవత్మాల్‌ జిల్లాల్లోని కమ్యూనిటీలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం దీని లక్ష్యం. కమ్యూనిటీ స్థాయిలో మార్పు కోసం కృషి చేసే మహిళలు ఎంపిక చేయబడతారు. ఈ ప్రాజెక్ట్‌ కింద 13,834 మంది మహిళలు, యువతకు నీటి నాణ్యత పరీక్ష, ఫీల్డ్‌ టెస్ట్‌ కిట్‌ వినియోగంపై శిక్షణ ఇచ్చారు. 4,067 మంది మహిళలు భాగస్వామ్య ప్రణాళిక, గ్రామ కార్యాచరణ ప్రణాళికా అభివృద్ధిపై శిక్షణ పొందారు. నీటి భద్రత ప్రణాళిక, మూల స్థిరత్వంపై 135 మంది మహిళలు శిక్షణ పొందారు. గ్రామసభలో భాగస్వామ్యాన్ని పెంచడానికి 4,634 మంది మహిళలు శిక్షణ పొందారు. అలాగే 184 మంది మహిళలు సాంకేతిక నిపుణులుగా శిక్షణ పొందారు. వారి పనితో పాటు ఈ ప్రాజెక్ట్‌ ద్వారా వారి కమ్యూనిటీలు ఎలా ప్రభావితమయ్యాయో అర్థం చేసుకోవడానికి మేము కొంతమంది మహిళా వాటర్‌ ఛాంపియన్‌లతో మాట్లాడాము.
అట్టడుగు స్థాయిలో మార్పు
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని కోటంబ గ్రామ సర్పంచ్‌గా ఉన్న రేణుకా కోటంబ్కర్‌ ఆ గ్రామంలో మంచినీటి కోసం ఉద్యమించారు. ”నా పెండ్లయ్యి గ్రామానికి వచ్చేటప్పటికి మహిళలు రెండుమూడు కి.మీ నడిచి తాగు నీటి కోసం వెళ్లాల్సి వచ్చేది. మహిళలను సమీకరించి చేతి పంపుల కోసం పంచాయితీ వారిని అడిగాను. తక్కువ కాలంలోనే మేము గ్రామంలో పబ్లిక్‌ కుళాయిని కూడా ఏర్పాటు చేసుకున్నాం” అని కోటంబ్కర్‌ గుర్తు చేసుకున్నారు. ఆమె సమిష్టి కృషిని చూసిన గ్రామస్తులు ఆమెను సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేయవలసిందిగా కోరారు. అందరి మద్ధతుతో ఆమె విజయవంతంగా గెలిచింది. ఇప్పుడు ఆమె రెండవ సారి కూడా గెలిచి కోటంబ్కర్‌ కోటంబలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. వాటర్‌ఎయిడ్‌ ఇండియా మద్దతుతో, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఉమెన్‌, చైల్డ్‌ అండ్‌ యూత్‌ డెవలప్‌మెంట్‌చే అమలు చేయబడిన విమెన్‌వాటర్‌ ప్రాజెక్ట్‌ మద్దతుతో ప్రభుత్వ భవనాలపై నిర్మించిన వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే గ్రామంలోని 285 కుటుంబాలకు పైపుల ద్వారా నీటి సరఫరా పథకం కింద కుళాయి నీటి కనెక్షన్లు ఏర్పాటు చేయడంలో రేణుక విజయం సాధించారు.
”సంవత్సరాలుగా నీటిని సంరక్షించడంతో పాటు దాన్ని ప్రాముఖ్యతను మేము తెలుసుకున్నాము. ఎనిమిది పారామితుల ఆధారంగా నీటిని ఎలా పరీక్షించాలో మాకు నేర్పించారు. ప్రతి ఇంటికి నీటి ప్రవాహం ఉండేలా చూడడానికి, జల్‌ టాక్స్‌ వసూలు చేయడానికి, గ్రామంలో నీటి కొరత లేకుండా అవసరమైనప్పుడు జోక్యం చేసుకోవడానికి మేము మహిళల కమిటీని ఏర్పాటు చేసాము. కోటంబ్కర్‌ సమన్వయంతో జరిగిన ఈ ప్రయత్నాలు ప్రభుత్వ వనరులు, వ్యక్తిగత నిధులు, గ్రామస్తుల సమిష్టి కృషితో ఆచర సాధ్యమయ్యాయి. ఆర్థికంగా వెనుకబడిన అన్ని కుటుంబాలకు కుళాయి కనెక్షన్‌ని పొందేందుకు నేను కూడా వ్యక్తిగతంగా కొంత సహాయం చేసారు. రూ. 50 కంటే తక్కువ వాయిదాలలో చెల్లించడానికి అనుమతించారు. కోటంబ్కర్‌ కృషిని గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మల్‌ గ్రామ్‌ అవార్డు, ఆదర్శ సర్పంచ్‌ అవార్డు, స్మార్ట్‌ విలేజ్‌ అవార్డు, ది. ఛత్రపతి అవార్డు ఇచ్చింది. వేసవిలో కూడా నీటి కొరత లేకుండా చేయగలిగితే అది గ్రామానికి గర్వకారణం. గ్రామాల్లోని అన్ని ఇండ్లకు ప్రయోజనం చేకూర్చేలా రెయిన్వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్లను నెలకొల్పడమే మా ప్రణాళిక ఇప్పుడు” అని ఆమె చెప్పారు.
రేణుకా కోటంబ్కర్‌
  సామాజిక మార్పుకు
పదేండ్ల కిందట మహారాష్ట్రలోని యవత్మాల్‌ జిల్లాకు చెందిన ఆశాతాయి ప్రతిరోజూ నీటిని సేకరించేందుకు వ్యవసాయ పొలాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ”చాలా మంది మహిళలు బరువులు మోసి వెన్ను నొప్పితో బాధపడేవారు. నేను మహిళా గ్రామసభ సమావేశాన్ని నిర్వహించాను. దాని ద్వారా గ్రామానికి ప్రత్యేక పైప్‌లైన్‌ కోసం గ్రామ పంచాయతీ తీర్మానం చేయవలసి వచ్చింది” అని ఆమె చెప్పారు. ఇంటి స్థాయిలో సోక్‌ పిట్‌లను తయారు చేసేందుకు నాలుగు గ్రామాల్లోని మహిళల మద్దతు కూడగట్టడంతో ఆశాతాయి కృషి ఫలించింది. ప్రాజెక్ట్‌ బృందం మార్గదర్శకత్వంతో ఆమె 148 సోక్‌ పిట్‌లను తయారు చేయడంలో సహాయపడ్డారు. దీనితో పాటు ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీన్‌ కింద 25 ఇండ్లకు మరుగుదొడ్ల నిర్మాణానికి మంజూరు కావడంలో ఆమె సహాయం చేశారు. బావి రీఛార్జ్‌ నిర్మాణం కోసం ప్రజలను చైతన్యపరిచారు. ఇప్పుడు వారి మంచి నీరు అందుబాటులోకి వచ్చింది. వాటర్‌ ఎయిడ్‌ ప్రాజెక్ట్‌తో జట్టుకట్టడం సామాజిక మార్పుకు నాంది పలికింది. ”నీటిని ఎలా సంరక్షించాలో, పరీక్షించాలో నేర్చుకోవడమే కాకుండా సమానత్వ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్‌ మాకు సహాయపడింది. ఇంతకుముందు మహిళలు గ్రామసభ సమావేశాలకు హాజరయ్యే వారు కాదు. నిజానికి ఆడపిల్ల పుట్టిందంటే అందరూ నిరాశ చెందేవారు. చిన్న వయసులోనే పెండ్లి చేసేవారు. ఈ ప్రాజెక్ట్‌ మాకు సమానత్వం గురించి, స్థానిక పాలనలో ఎలా పాలుపంచుకోవాలో నేర్పింది” అని ఆమె చెప్పారు.
ఆశాతాయి
 సవాళ్లను ఎదుర్కోవడం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లాలోని నయాపురా గ్రామానికి చెందిన బబితా లిరోలియాకు ‘నీటి భద్రత’ అనే పదానికి అర్థం కూడా సరిగా తెలియదు. అయినప్పటికీ తన గ్రామం నుండి శిక్షణా కార్యక్రమాలకు ఎంపిక చేయబడిన ఏకైక మహిళ. ఆమె సవాలును స్వీకరించింది. తన గ్రామంలో నీటి సంరక్షణ ప్రయత్నాలకు నాయకత్వం వహించింది. నేడు లిరోలియా అట్టడుగు స్థాయిలో చేసిన కృషికి నేషనల్‌ వాటర్‌ మిషన్‌, ఖచీణూ, స్టాకహేోమ్‌ ఇంటర్నేషనల్‌ వాటర్‌ ఇనిస్టిట్యూట్‌చే మహిళా వాటర్‌ ఛాంపియన్‌గా గుర్తింపు పొందింది. ఆమె ప్రధాన పని నీటి నాణ్యతను పరీక్షించడం. చేతి పంపు మరమ్మత్తుపై శిక్షణా సెషన్‌కు కూడా ఎంపికయింది. లిరోలియా తన పని గురించి స్పష్టంగా, ఉత్సాహంగా ఉంది. గ్రామంలో పగిలిన నీటి పైపును బాగుచేసినప్పుడు ఆమె ఎంత సంతోషించిందో చెబుతూ ”నేను నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌తో కలిసి పనిచేసినప్పటికీ నీటి సంరక్షణ గురించి ఆలోచన లేదు. ప్రాజెక్ట్‌ బృందం నీటిని అన్ని పారామితులు, నీటి నిల్వ మొదలైన వాటిపై పరీక్షించమని నాకు నేర్పింది” ఆమె చెప్పారు. త్వరలో లిరోలియా నయాపురా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి నీరు సరిగ్గా నిల్వ చేయడం, పిల్లలకు అందుబాటులో లేకుండా పొడవాటి హ్యాండిల్స్‌తో టంబ్లర్‌లతో ఉపయోగించే విధంగా అవగాహన కల్పించింది. పరీక్షలను సులభతరం చేయడానికి, గ్రామంలోని చేతి పంపులు, కుళాయిల కోసం మ్యాప్‌ను గీసేందుకు, నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి క్రమం తప్పకుండా ప్రతి ఇంటిని సందర్శించేలా ఆమె 10 మంది మహిళల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ”వానాకాలం ముందు, తర్వాత నీరు తాగడానికి సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి మేము పరీక్షిస్తాము. వివిధ ప్రాంతాలకు వెళ్లి పగిలిన పైపులను పరిశీలించి వెంటనే మరమ్మతులకు ఏర్పాట్లు చేస్తున్నాం. మేము జూన పరీక్ష గురించి ఇతరులకు నేర్పుతాము. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు సమాజ ఆరోగ్యానికి ఎంతో హానికరం” ఆమె అంటున్నారు.
బబితా లిరోలియా
ధైర్యంగా మాట్లాడుతున్నారు
మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌ జిల్లాలోని మహుకాల అనే గ్రామ నివాసి రాధా మీనా విమెన్‌ ం వాటర్‌ సమ్మేళనం కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకురాలు. ప్రాజెక్ట్‌ కింద నీటి సమస్యలపై అనేక శిక్షణలు ఇచ్చారు. మీనా భర్త ఏడాది కిందట చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ పిల్లలను పోషించుకుంటుంది. అలాగే గ్రామంలోని కుళాయి నీటి పథకం పనులు కూడా చూసుకుంటోంది. గ్రామంలో మొత్తం 174 కుటుంబాలు ఉన్నాయి. మర్దాన్‌పూర్‌ గ్రామీణ నీటి సరఫరా కుళాయి నీటి పథకం ద్వారా తాగునీటి వ్యవస్థ జరుగుతోంది. 143 కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా పరిశుభ్రమైన, సమృద్ధిగా నీరు అందుతోంది. ”నేను మర్దన్‌పూర్‌ రూరల్‌ గ్రూప్‌ వాటర్‌ సప్లై స్కీమ్‌ను పబ్లిక్‌ లాబీయింగ్‌ ద్వారా ఆమోదించడంలో సహాయం చేసాను. పథకం పరీక్ష, నిర్మాణం, అమలును నిరంతరం పర్యవేక్షించడంలో కూడా నేను సహాయం చేశాను” అని ఆమె చెప్పారు. పైప్‌లైన్‌ సంబంధిత పనులైన సరైన ప్రదేశాల్లో చెక్‌ వాల్వ్‌ల ఏర్పాటు, అన్ని కుళాయిల్లో లీకేజీ సమస్య, ఇతర నాణ్యమైన పనుల్లో మీనా సహాయం చేస్తున్నారు. ఆమె తన అభ్యాసాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లింది. సమాజంలోని ఇతరులకు నీటి భద్రత గురించి కూడా బోధించింది. ఆమె మహిళలను వారి సమావేశాలలో పాల్గొనమని ప్రోత్సహించింది. కొన్నిసార్లు ఆమె స్వరం వినిపించేందుకు లౌడ్‌ స్పీకర్‌ను ఉపయోగిస్తుంది. ”2019కి ముందు గ్రామీణ సమాజంలోని మహిళలు, ప్రజలకు తగినంత స్వచ్ఛమైన నీరు లభించలేదు. కానీ నేడు మహిళలు తమ కుటుంబాలను పోషించగలుగుతున్నారు, వారి పిల్లలతో తగినంత సమయం గడుపుతున్నారు. ఇది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. గతంలో బయటకు వచ్చి మాట్లాగలిగే వాళ్ళం కాదు. ఇప్పుడు ధైర్యంగా బయటకు వస్తున్నాం. సమానత్వం గురించి మాట్లాగలుగుతున్నాం. ఈ ప్రాజెక్ట్‌ మంచినీటిపైన మాత్రమే కాకుండా మా జీవితంలో రావల్సిన అన్ని రకాల మార్పులపైన మాకు అవగాహన కల్పించింది” అని మీనా చెప్పారు.
రాధా మీనా

Spread the love