ప్రపంచంలోనే చైనా తర్వాత టీని ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. మన దగ్గర అస్సాం, డార్జిలింగ్ టీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. 200 ఏండ్ల నాటి చరిత్ర కలిగిన మన తేయాకు పరిశ్రమలో దాదాపు 80శాతం మంది మహిళలే పని చేస్తున్నారు. అయితే శ్రామికశక్తిలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ సాధికారతకు మాత్రం బహుదూరంగా ఉన్నారు. రెండేండ్ల కిందట ×ణన-ది సస్టైనబుల్ ట్రేడ్ ఇనిషియేటివ్ అనే సంస్థ తేయాకు తోటల్లో మహిళా కార్మికుల స్థితిని నిశితంగా పరిశీలించింది. ఆ పరిశోధనా వివరాలేంటో మనమూ తెలుసుకుందాం… ఏ తోటలోనూ మహిళా మేనేజర్ కానీ, ఫిర్యాదు అధికారి కానీ లేరని ఈ పరిశోధనలో తేలింది.
”చాలా తోటల్లో అంతర్గత కమిటీలు (లైంగిక వేధింపుల నుండి మహిళల రక్షణ) చట్ట మార్గదర్శకాల ప్రకారం ఏర్పడలేదు. అయితే ప్రస్తుతం అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులోని 350 తేయాకు తోటలలో 80శాతం కంటే ఎక్కువ మహిళా అధ్యక్షురాలు పనిచేస్తున్న అంతర్గత కమిటీలు ఉన్నాయి” అని వారి ఉమెన్స్ సేఫ్టీ యాక్సిలరేటర్ ఫండ్ (WSAF) మేనేజర్ మనీషా మజుందార్ చెప్పారు. అస్సాం అంతటా 29 టీ ఎస్టేట్‌లలో లింగ వివక్షపై అవగాహనా కల్పించేందుకు 2021లో ప్రారంభించబడిన (WSAF) ద్వారానే ఇది సాధ్యమైంది.(WSAF) అనేది మహిళల భద్రతపై దృష్టి పెడుతుంది. టీ పరిశ్రమలో పని చేస్తున్న మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రైవేట్ సంస్థ ఇది.
WSAF అవసరం
×ణన ప్రకారం తేయాకు ఉత్పత్తిలో మహిళల అనివార్య పాత్ర ఉన్నప్పటికీ వారి పని పరిస్థితులు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఉదాహరణకు అస్సాంలోని టీ ఎస్టేట్‌లలో ప్రసూతి మరణాల రేటు కొంత వరకు మెరుగు పడినప్పటికీ, ఇవి ఇప్పటికీ భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోని టీ తోట మహిళా కార్మికులలో బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ప్రసూతి మరణాలు, వివిధ రకాల వివక్ష, హింస స్పష్టంగా కనిపిస్తున్నాయని ×ణన పరిశోధన చూపిస్తుంది. ”టీ కమ్యూనిటీలో ముఖ్యంగా అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల మహిళల సమస్యలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. చాలా మంది మహిళలు, వారి కుటుంబాలతో తోటల చుట్టూ నివసిస్తుంటారు. వారి పని స్థలానికి, నివాస స్థలానికి మధ్య రేఖ చాలా సన్నగా ఉంటుంది. అందుకే సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి” అని మనీషా అంటున్నారు. అందుకే ఔూAఖీ మొత్తం టీ రంగంలోని మహిళా శ్రామికశక్తికి సురక్షితమైన పని పరిస్థితులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
అవగాహన కల్పించేందుకు
టీ ఎస్టేట్‌లో సాధారణంగా ఆఫీస్, వర్కర్ కాలనీలు ఉంటాయి. ఇవి నగరాలకు చాలా దూరంగా ఉంటాయి. దాంతో స్థానిక పాలనతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. దాంతో హక్కులు, ప్రభుత్వ కల్పించే సౌకర్యాల గురించి వారికి ఎటువంటి అవగాహన లేదు. ఈ సమస్యలను మేము పరిష్కరించాలనుకుంటున్నాం” అని మనీషా చెప్పారు. వీరి ప్రయత్నంలో భాగంగా హింసకు వ్యతిరేకంగా సమాజంలో అవగాహన కల్పించడానికి వీధి నాటకాలలో మహిళలకు శిక్షణ ఇచ్చారు. నిర్దిష్ట సమస్యల కోసం ఏ అధికారిని సంప్రదించాలి, ఫిర్యాదులు ఎలా ఇవ్వాలి వంటి విషయాల గురించి వారికి తెలియజేసారు. దీనికి సంబంధించిన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మొత్తం ప్రక్రియ మరింత క్రమబద్ధీకరించబడింది. స్టేకహేోల్డర్‌లను చేర్చుకోవడం ఈ ప్రోగ్రామ్‌లో అతి ముఖ్యమైనది. ఇది వివిధ స్థాయిలలో పని చేస్తుంది.
హింస చాలా రకాలు
అస్సాంలోని కనై గావ్‌లోని మౌకల్‌బరి టీ ఎస్టేట్‌లోని మహిళా ప్లకర్స్ గ్రూప్ నాయకురాలు సన్నీ ముండా మాట్లాడుతూ ‘మహిళలపై జరుగుతున్న హింస కేవలం ఈవ్ టీజింగ్, వేధింపులతో ముగిసిపోదు. దీని ప్రభావం మా జీవితాలపై తీవ్రంగా ఉంటుంది. ఇందులో గృహ హింస, ఆర్థిక అభద్రత, దుర్భరమైన పని గంటలు, కనబడని యాజమాన్య వేధింపులు, పిల్లలపై లైంగిక వేధింపులు ఇలా ఎన్నో ఉన్నాయి. మహిళా కార్మికుల జీవితాల్లో ఇవన్నీ ఒక భాగం” అన్నారు. ”మేము సంపాదించిన డబ్బును మా భర్తలు బలవంతంగా తీసుకొని మద్యానికి ఖర్చు చేస్తారు. దాంతో మా పిల్లలకు తిండి పెట్టలేక, పాఠశాలకు పంపలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇది మా ఉత్పాదకతను కూడా ప్రభావితం చేస్తుంది” అని మోకల్‌బరి ఎస్టేట్‌లోని మరో మహిళా కార్మికురాలు సునీతా చవాసి చెప్పారు.
ఫిర్యాదు సులభతరం చేయడానికి
సన్నీ వంటి వారికి ఫిర్యాదుల ప్రక్రియను సులభతరం చేయడానికి ఔూAఖీ ప్రతి ఎస్టేట్‌లో స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చి తోటల మధ్య జెండర్ సెల్‌లను ఏర్పాటు చేసింది. అలాగే హక్కుల కోసం పని చేసే ఢిల్లీకి చెందిన సాక్షి అనే ఎన్‌జీఓ గత ఏడాది ఔూAఖీ భాగస్వాములలో ఒకటిగా మారింది. ప్రస్తుతం సాక్షి పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులోని 64 తేయాకు తోటలకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లింది. ‘హింసకు మూల కారణాలను, లింగవివక్షను అర్థం చేసుకోవడానికి మేము సమాజ్ నాయకులకు శిక్షణ ఇస్తాం. సంభా షణలు, వర్క్‌షాప్‌లు, రోల్ ప్లేలు, పాటలు, ప్రదర్శనలు వంటి వాటిని అవగాహన కోసం ఉపయోగి స్తాము. ప్రతి ఒక్కరినీ వారి హక్కుల గురించి తెలుసుకునేలా అన్ని రకాల హింసకు వ్యతిరేకంగా వారి స్వరాన్ని పెంచడానికి సన్నద్ధం చేయడమే ఔూAఖీ లక్ష్యం” అని సాక్షి ప్రతినిధి భారతి అంటున్నారు.
– సలీమ