ఘనా మహిళల పోరాటం డోంట్‌ టాక్స్‌ మై పీరియడ్‌

ఘనా మహిళలు ”డోంట్‌ టాక్స్‌ మై పీరియడ్‌” అంటూ కవాతు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. తమ దేశంలో రుతుస్రావ పరిశుభ్రత ఉత్పత్తులపై పన్ను విధించడాన్ని, వీటిని మహిళలు వాడే విలాస వస్తువుల కింద పరిగణించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. రుతుస్రావ సమయంలో సురక్షితమైన ప్యాడ్స్‌ ఉపయోగించాలనే అవగాహన ఇప్పటికే చాలా మంది పేదలకు లేదు. ఈ పన్ను భారం వల్ల వాడే కొద్దిమంది కూడా వాటికి దూరమయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్యాడ్స్‌పై విధించిన పన్నును ఖండిస్తూ ఉద్యమం చేస్తున్నారు. ఆ వివరాలు నేటి మానవిలో…
జూన్‌ 22న ఘనా కార్యకర్తలు ”డోంట్‌ టాక్స్‌ మై పీరియడ్‌” అనే నినాదాలు ఉన్న ప్లకార్డ్‌ పట్టుకొని అక్ర వీధుల్లోకి వచ్చారు. రుతుస్రావ పరిశుభ్రత ఉత్పత్తులపై పన్ను భారాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. యెబెతుమి, ఒబాసిమా సంస్థల కార్యకర్త సహకారంతో ఘనా సోషలిస్ట్‌ మూవ్‌మెంట్‌(SMG) ఉమెన్స్‌ వింగ్‌ దీనికి నాయకత్వం వహిస్తున్నది.
పీరియడ్‌ పేదరికం
పెరుగుతున్న ధరలు దేశంలోని మెజారిటీ కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఘనా ఘోరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షోభం కారణంగా ప్రజలు కనీసం నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేయలేకపోతు న్నారు. ఈ పరిస్థితి మహిళ లతో పాటు బలహీన వర్గా లపై అసమాన ప్రభావాన్ని చూపు తున్నది. ప్రపంచ మహిళా జనాభాలో నాలుగింట ఒక వంతు రుతుస్రావ వయసులో ఉన్నప్పటికీ 500 మిలియన్ల మంది రుతు పరిశుభ్రత ఉత్పత్తులకు ప్రాధాన్యతే ఇవ్వడం లేదు. అంటే వారంతా పీరియడ్‌ పేదరికంలో ఉన్నారు. అంటే రుతుక్రమ ఉత్పత్తులను కొనుగోలు చేసే ఆర్థిక శక్తి వారి వద్ద లేదు.
పన్నులతో పెరిగిన భారం
పన్నుల తొలగింపు కోసం కార్యకర్తలు కవాతుకు సిద్ధమయ్యారు. ఈ పన్నులు ఘనాలో పేదరికాన్ని ఎలా పెంచుతున్నాయో తెలుసుకునేందుకు జూన్‌ 21న ”లింగ జీవన వ్యయం: వర్కింగ్‌ క్లాస్‌ మహిళలపై విలాసవంతమైన పన్ను ప్రభావం” అనే శీర్షికతో పాన్‌ ఆఫ్రికనిజం టుడే ఒక చర్చను నిర్వహించింది. ఇందులో(SMG) మహిళా విభాగం నాయకురాలు, స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలు లోరెట్టా అషీ, ట్రైకాంటినెంటల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ లో విద్యావేత్త, పరిశోధకురాలు మైకేలా ఎర్స్కోగ్‌ పాల్గొన్నారు. ఈ చర్చ సామాజిక, ఆర్థిక సమస్యలను లేవనెత్తింది.
మహిళల సమస్యగా
రుతుస్రావంలో ఉన్నవారికి సరసమైన ధరలకు ఉత్పత్తులు అందించేందుకు ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో ఈ పన్నుల భారం (ఘానాలో మాత్రమే కాదు) ప్రతిబింబిస్తుంది. నిజానికి ఈ ఉత్పత్తులను ముఖ్యమైన వస్తువుగా వర్గీకరించడం లేదు. అంతేకాకుండా రుతు పరిశుభ్రత సమస్యలను మహిళల సమస్యగా చూసే ధోరణి మారాలని, దీన్ని రాజకీయ, సామాజిక, ప్రజారోగ్య ప్రాముఖ్యతకు సంబంధించిన విషయంగా చూడాలనే చర్చ అక్కడ జరిగింది.
కనీస సౌకర్యాలు లేక
పీరియడ్‌ ఉత్పత్తుల ధరలను పక్కన పెడితే కనీసం టాయిలెట్‌ సౌకర్యాలు లేవు, తాగునీరు లేదు, శానిటరీ ఉత్పత్తులను పారవేసేందుకు అవసరమైన సౌకర్యాలు లేనందున బాలికలు పాఠశాలకు దూరంగా ఉండవలసి వస్తుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ఈ సమస్యతో చాలామంది బాలికలు పాఠశాలలు పూర్తిగా మానేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శానిటరీ ప్యాడ్‌ల అధిక ధరల కారణంగా కొందరు వాటిని ఉపయోగాన్ని మానేయడం, లేదా గుడ్డ ముక్కలను ఉపయోగించడం వంటివి చేయవలసి వస్తున్నది.
తిండి ఎలా తింటారు..?
”మా కనీస వేతనం 14 సెడీలు, 88 పెసేవాలు. ఇది దాదాపు ఖూణ 1.88. ఒక మెన్‌స్ట్రువల్‌ ప్యాడ్‌ 15 నుండి 40 సెడిస్‌ల మధ్య అమ్మబడుతుంది. కాబట్టి ఒక వ్యక్తి రెండు ప్యాడ్‌లను ఉపయోగిస్తే వారు దాదాపుఘనా మహిళలు ”డోంట్‌ టాక్స్‌ మై పీరియడ్‌” అంటూ కవాతు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. తమ దేశంలో రుతుస్రావ పరిశుభ్రత ఉత్పత్తులపై పన్ను విధించడాన్ని, వీటిని మహిళలు వాడే విలాస వస్తువుల కింద పరిగణించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు 70 నుండి 80 సెడిస్‌లు ఖర్చు చేస్తున్నారు. ఇది వారి ఆదాయంలో దాదాపు 20 నుంచి 25శాతం” పీరియడ్స్‌ ప్యాడ్స్‌ కోసమే ఇంత పోతే ఇక ఇంటి అద్దెలు ఎలా కడతారు, తిండి ఎలా తింటారు. వారిపై ఆధారపడే వారుంటే వారి కడుపు ఎలా నింపుతారు” అని ఆషీ చెప్పారు.
ఉచితంగా అందించాలి
”ప్రభుత్వం ఈ పన్నులను వెంటనే ఎత్తివేయాలి. శానిటరీ ప్యాడ్‌లకు సబ్సిడీ ఇవ్వాలి. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా అందించాలి. శానిటరీ ఉత్పత్తులను తప్పనిసరిగా ముఖ్యమైన వస్తువుగా పరిగణించాలి” అని ఆమె అన్నారు. వీరి నిరసనకు అతీతంగా తన పోరాటాన్ని కొనసాగించబోతోంది. రుతుస్రావం, విద్యకు ప్రాముఖ్యం ఇస్తూ దీని చుట్టూ అల్లుకొని ఉన్న సామాజిక సమస్యలను అంతం చేయడానికి పని చేస్తున్నది.

మళ్లీ వీధుల్లోకి వస్తాం
నిరసనకారులు పార్లమెంటుకు కవాతు చేశారు. స్పీకర్‌ ఆ ప్రతినిధి బృందంతో సమావేశమై వారి డిమాండ్లను వినడానికి కొనసాగుతున్న తమ సమావేశానికి విరామం ఇచ్చారు. వారి డిమాండ్లపై త్వరలో సానుకూల స్పందన వస్తుందని స్పీకర్‌ అల్బన్‌ బాగ్బిన్‌ నిరసనకారులకు హామీ ఇచ్చారు. బహిష్టు పరిశుభ్రత ఉత్పత్తులపై పన్నులు ఎత్తివేయకుంటే మళ్లీ వీధుల్లోకి వస్తామని కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.
సామాజిక నిబంధనతో…
”రోజురోజుకీ వస్తువుల ధరలు పెరిగిపోతు న్నాయి. దీని వల్ల మహిళలే ఎక్కువగా బాధ పడుతున్నారు. ఎందుకంటే లింగ వివక్ష కారణంగా మహిళల ఆదాయం తక్కువ. పైగా అనధికారిక రంగంలో పని చేస్తూ పింఛన్లు పొందలేకపోతున్నారు. ఈ ఆర్థిక సంక్షోభంతో మహిళలు పురు షుల కంటే పది రెట్లు ఎక్కువ బాధను ఎదుర్కొంటున్నారు” అని ఎర్స్కోగ్‌ అన్నారు. రుతుక్రమం అంటే అంతర్లీనంగా కలుషితమైనదిగా, అంటరానిదిగా చూసే సామాజిక నిబంధనల వల్ల పీరియడ్‌ పేదరికం పెరిగిపోతున్నది. ఇది రుతుక్రమానికి సంబంధించిన సమస్యలపై బహిరంగ చర్చలకు ఆటంకం కలిగిస్తుంది.

Spread the love