బుల్లితెరపై చెరగని ముద్ర


ఒక ఇంటర్వ్యూలో యాంకర్‌గా ఉన్న సమయంలో అభిమానుల నుండి తనకు వచ్చిన మెయిల్స్‌, లేఖల గురించి మాట్లాడారు. వాటిలో కేవలం ఆమె యాంకరింగ్‌ గురించే కాకుండా, విలక్షణమైన ఆమె కేశాలంకరణ, వస్త్రధారణ గురించి కూడా ఎన్నో ప్రశంసలను పొందారు. వార్తలు చదివే ఆమె తీరు ఎందరినో ప్రభా వితం చేసింది. ఆమె ఎప్పుడైనా బయట కనిపించినపుడు అభిమా నులు ఆపి మరీ పలకరించే వారిని ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అభిమానులు తన హెయిర్‌ డ్రెస్సర్‌, టైలర్‌ గురించి వివరాలు అడిగేవారంట.

ప్రతి క్షణం అప్రమత్తంగా…
గీతాంజలి టెలిప్రాంప్టర్‌ల వంటి సాంకేతిక సహాయాలు అందుబాటులో లేని సమయంలో యాంకర్‌గా పని చేశారు. యాంకర్‌లుగా ఎంతో ప్రశాంతంగా కనిపించాలి. అలాగే కెమెరాపై ఫోకస్‌ చేస్తూ, చేతిలో ఉన్న పేపర్లను చూస్తూ సమతుల్యం చేసుకోవాలి. అప్పట్లో న్యూస్‌ రీడర్లుగా తాము ఎదుర్కొన సవాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ”మాకు టెలిప్రాంప్టర్‌లు లేవు. మా కోసం స్క్రిప్ట్‌ను మాన్యువల్‌గా ఒక వ్యక్తి రోల్‌ చేస్తుంటారు. కెమెరా వైపు, చదవాల్సిన వార్తల వైపు ఒకే సమయంలో చూడటం చాలా కష్టం. కెమెరా దగ్గర నిలబడి ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా సైగ చేసి, అవసరాన్ని బట్టి వేగంగా లేదా నెమ్మదిగా చదవమని అడుగుతాడు. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ వార్తలు చదవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి క్షణం మేము ఎంతో అప్రమత్తంగా ఉండాలి” అన్నారు.
మూడు దశాబ్దాలకు పైగా బుల్లితెరపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ న్యూస్‌రీడర్‌… దూరదర్శన్‌లో మొదటి తరం మహిళా ఆంగ్ల వార్తా వ్యాఖ్యాతలలో ఒకరిగా కీర్తి గడించారు… అంతేకాదు థియేటర్‌ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు… ఆమే గీతాంజలి అయ్యర్‌. అలాంటి ఆమె జూన్‌ 7వ తేదీన 76 ఏండ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాలు…

    గీతాంజలి అయ్యర్‌ 29 జనవరి 1947 జన్మించారు. ఢిల్లీలో పెరిగారు. కేథడ్రల్‌ అండ్‌ జాన్‌ కానన్‌ స్కూల్లో చదువుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, కోల్‌కతాలోని లోరెటో కాలేజీ నుండి పట్టభద్రురాలయ్యారు. అలాగే న్యూఢిల్లీలోని నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా (చీూణ) నుండి డిప్లొమా పొందారు. భారతీయ ఆర్థికవేత్త, పాత్రికేయుడు, కాలమిస్ట్‌ అయిన స్వామినాథన్‌ ఎస్‌. అంక్లేసరియా అయ్యర్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. తర్వాత కాలంలో వీరు విడిపోయారు. గీతాంజలికి కూతురు పల్లవి, శేఖర్‌ అయ్యర్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

వార్తలు చదవాలని కోరిక
చిన్నతనం నుండి గీతాంజలి సురోజిత్‌ సేన్‌, పమేలా సింగ్‌ వంటి వారు రేడియోలో వార్తలు చదవడాన్ని గమనిస్తూ పెరిగిన ఆమె వారిచే బాగా ప్రభావితమ య్యారు. వాళ్ళు చదువుతున్న వార్త లను తన సొంత శైలిలో అనుకరణ చేస్తుండేవారు. అలా ఆరేండ్ల వయసు నుండే ఆమెకు న్యూస్‌ యాంకర్‌ కావాలని కోరిక. ఆ కోరికతోనే 1971లో దూరదర్శన్‌లో చేరారు. పదేండ్లకు పైగా వారానికి కొన్ని రోజులు రాత్రి 9:00 గంటలకు ఆంగ్లంలో ప్రైమ్‌-టైమ్‌ వార్తలను చదివారు. వార్తలతో పాటు ప్రతి శుక్రవారం రాత్రి ఆల్‌ ఇండియా రేడియోలో ఇంగ్లీష్‌ పాటల కార్యక్రమం ‘ఎ డేట్‌ విత్‌ యు’తో సహా పలు ప్రముఖ షోలను హోస్ట్‌ చేశారు. 1978లో ఆల్‌ ఇండియా రేడియో, దూరదర్శన్‌ వేర్వేరు సంస్థలుగా మారినప్పుడు గీతాంజలి దూరదర్శన్‌తో కలిసి పని చేశారు.
అనేక పదవుల్లో…
2002లో దూరదర్శన్‌ నుండి వచ్చేశారు. దూరదర్శన్‌లో పనిచేయడమే కాకుండా గీతాంజలి వివిధ ప్రఖ్యాత సంస్థలలో కొన్ని ముఖ్యమైన పదవులను నిర్వహించారు. 1982 నుండి 1983 వరకు ఢిల్లీలోని తాజ్‌ హోటల్స్‌ రిసార్ట్స్‌ అండ్‌ ప్యాలెస్‌లలో సేల్స్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ మేనేజర్‌గా చేశారు. 1994 నుండి 1998 వరకు డామ్లియా గ్రూప్‌ అండ్‌ కార్పొరేట్‌ వాయిస్‌ షాండ్‌విక్‌ ూ= కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1998లో న్యూ ఢిల్లీలోని బ్రిటీష్‌ హైకమిషన్‌లో ప్రెస్‌ అండ్‌ పబ్లిక్‌ అఫైర్స్‌ విభాగానికి డిప్యూటీ హెడ్‌గా నియమితులై 2001 వరకు ఈ పదవిలో ఉన్నారు.
కార్పొరేట్‌ అండ్‌ మార్కెటింగ్‌
దూరదర్శన్‌లో తర్వాత గీతాంజలి కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌, ప్రభుత్వ అనుసంధానమై మార్కెటింగ్‌లో పని చేశారు. 2001 నుండి 2005 వరకు న్యూఢిల్లీలోని యష్‌ బిర్లా గ్రూప్‌ పబ్లిక్‌ ఎఫైర్స్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2005 నుండి 2007 వరకు న్యూఢిల్లీలోని ది ఒబెరారు గ్రూప్‌లో అంతర్జాతీయ సేల్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 2007లో కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీలో కన్స ల్టెంట్‌గా చేరి అందులో 2010 వరకు కొన సాగారు. 2011లో వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ (ఔఔఖీ) అధిపతిగా మారారు. అంతేకాదు కొడుకు అమెరికాలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌లో కూడా పనిచేశారు.
ప్రకటన, థియేటర్‌, టెలివిజన్‌
గీతాంజలికి నాటక రంగంపై మక్కువ ఎక్కువ. అనేక నాటకాలలో కూడా నటించారు. 1985లో శ్రీధర్‌ క్షీరసాగర్‌ దర్శకత్వం వహించిన దూరదర్శన్‌ టెలివిజన్‌ ధారావాహిక ‘ఖందాన్‌’లో కూడా నటించారు. అలాగే వివిధ ప్రింట్‌ ప్రకటనలలో కూడా కనిపించారు. అందులో ఒకటి మార్మైట్‌ బ్రాండ్‌ కోసం చేశారు. ఇది తన ఇంటిలోనే డైనింగ్‌ టేబుల్‌ మీద తీసిన చిత్రం. 1989లో గీతాంజలి అత్యుత్తమ మహిళగా ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డును గెలుచుకున్నారు. దూరదర్శన్‌లో తన పదవీకాలంలో నాలుగు సార్లు ఉత్తమ యాంకర్‌గా అవార్డు పొందారు.
బ్రెయిన్‌ హెమరేజ్‌తో…
మొదటితరం న్యూస్‌ రీడర్‌గా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఆమె కొన్ని రోజులుగా పార్కిన్సన్స్‌ వ్యాధితో పోరాడుతున్నారు. ప్రతి రోజు వాకింగ్‌కి వెళ్ళి వచ్చే ఆమె జూన్‌ 7వ తేదీ కూడా వాకింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలారు. సహాయకులు వెంటనే న్యూఢిల్లీలో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. ఆమె మరణానికి బ్రెయిన్‌ హెమరేజ్‌ కారణమని వైద్యులు నిర్ధారించారు.

Spread the love