మెప్పించే సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌

సాహస్‌, దీపిక నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘7:11 పీఎమ్‌’. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ సింగిల్‌ తర్వాత విడుదలైన టీజర్‌తో అందరిలో ఈ సినిమాపై క్యురియాసిటీ పెంచింది.
చైతు మాదాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆర్కస్‌ ఫిల్మ్స్‌ పతాకంపై నరేన్‌ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఆదివారం ఈ సినిమా విడుదల తేదీని నిర్మాతలు అనౌన్స్‌ చేశారు. మైత్రి ద్వారా ఈనెల 30న విడుదల చేస్తున్నామని, ప్రముఖ ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌ హౌస్‌ తమ చిత్రానికి సపోర్ట్‌ ఇవ్వడంతో సినిమాని భారీగా విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ‘ఇదొక హైలీ స్క్రీన్‌ప్లేతో నడిచే కమర్షియల్‌ చిత్రం. 1999లో ఒక ముఖ్యమైన రోజున, భవిష్యత్తులో 400 సంవత్సరాలలో వేరే గ్రహం నుండి మానవుల మనుగడకు కీలకమైన సమాధానాల కోసం ‘హంసలదీవి’ అనే చిన్న ఇండియన్‌ టౌన్‌కి చేరుకుంటారు. అదే రోజున ఆ టౌన్‌ ని నాశనం చేయడానికి కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇవన్నీ ఫాస్ట్‌ ఫేస్డ్‌ థ్రిల్లర్‌గా సీట్‌ ఎడ్జ్‌ అనుభూతిని పంచుతాయి’ అని చిత్ర బృందం తెలిపింది.

Spread the love