కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. ఈనెల 25న సినిమా విడుదల కానున్న సందర్భంగా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్న క్లాక్స్ (ఉద్దరాజుహొవెంకట కష్ణ పాండురంగ రాజు) మీడియాతో ముచ్చటించారు.
మాది భీమవరం దగ్గర ఓ పల్లెటూరు. చిత్రసీమలోకి రాకముందు చాలా ఉద్యోగాలు చేశా. నా రూమ్మేట్స్ సినిమాల్లో ట్రై చేసేవారు. వాళ్ళతోహొకథలు డిస్కస్ చేసేవాడిని. చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. అయితే, అనుకోకుండా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అని ఇటాలియన్ సినిమా చూసా. అది నాపై చాలా ప్రభావం చూపించింది. నా ఫ్రెండ్ చరణ్ ద్వారా సుధీర్ వర్మ పరిచయం అయ్యారు. దేవా కట్టా ‘బాహుబలి’ సిరీస్ తీయాలనిహొవర్క్ చేశారు. దానికి కూడా పని చేశా. తర్వాత రామ్ గోపాల్ వర్మ దగ్గర ఆరు నెలలు పని చేసే అవకాశం లభించింది. సినిమా అనేది సైన్స్ కాదు. దీన్ని రూల్స్ బట్టి చూడకూడదు. కళని కళగా చూడాలని అర్థమైంది. అప్పుడుహొనాలో భయం పోయింది. సుధీర్ వర్మ , దేవా కట్టా సెకండ్ యూనిట్ డైరెక్షన్ ఛాన్సులు ఇచ్చారు. అందువల్ల, ఈ సినిమా ఫస్ట్ డే డైరెక్ట్ చేసేటప్పుడు నాకు స్ట్రెస్ ఏమీ అనిపించలేదు.హొ
నా స్నేహితుడు అజరు భూపతి ద్వారా కార్తికేయ పరిచయం కావడంతో ఓ కథ చెప్పా. ఆయనకు నచ్చింది. ‘ఆర్‌ఎక్స్ 100’ భారీ విజయం సాధించడంతో ఆయన దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం చాల్లేదు. కొన్ని రోజుల తర్వాత ‘ఇంకోహొకథ ఉంది. వింటారా?’ అని కార్తికేయనుహొఅడిగితే… ‘ఓకే’ అన్నారు. అదే ఈ సినిమా.
ఈ సినిమా అంతా ఫిక్షనల్ ఐలాండ్‌లో జరుగు తుంది. మేం ‘ఎదురులంక’ అని ఓ ఊరిలో షూటింగ్ చేశాం. బోర్డులపై ‘బెదురులంక’ అని రాశాం. ఎందు కంటే… కథలో ఓ ఫియర్ ఉంటుంది. దానినిహొకంటిన్యూ చేసేలాహొఆ పేరు పెట్టాం.
నాకు అకిరా కురసోవాహొ’సెవెన్ సమురారు’ చాలా ఇష్టం. అందులో ఓ డైలాగ్ ఉంటుంది. రేపు ఉండదనిహొఅన్నప్పుడు… సమాజం ఏమనుకుంటుందోహొమనం పట్టించుకోం.
ఇది బాగా నచ్చింది.
ఆ పాయింట్ మీద ఏదో ఒకటి తీయాలని అనుకున్నా.హొఅప్పుడుహొహాలీవుడ్‌హొసినిమా ‘2012’ వచ్చింది. ఆ రెండింటి స్ఫూర్తితో పల్లెటూరి నేపథ్యంలో కొత్త కథ రాశా. డ్రామెడీ జోనర్‌లో సినిమా తీశా. సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుంది. వినోదం, డ్రామా ఎక్కువ ఉంటుంది. తెరపై పాత్రల కంటే ప్రేక్షకుడికి ఎక్కువ కథ తెలుస్తుంది. దాంతో వినోదం బావుంటుంది.హొ
ఇందులో ఊరిని ఎదిరించే కుర్రాడిగా కార్తికేయ కనపడతారు. ‘డీజే టిల్లు’ విడుదల తర్వాత నేహా శెట్టిని ఎంపిక చేశాం. ఆమె చాలా చక్కగా చేసింది. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు.హొసుధీర్ వర్మ టీజర్, ట్రైలర్స్‌హొచూసి, బావున్నాయని చెప్పారు. ఈ కథను అందరి కంటే ముందు చెప్పింది ఆయనకే. ‘స్వామి రారా’ కంటే ముందు వినిపించా. సెన్సార్ సభ్యులు సినిమా చూశారు. మా సినిమాకు ఒక్క విజువల్ కట్ కూడా ఇవ్వలేదు.హొవాళ్ళు బాగా ఎంజారు చేశారు. హ్యాపీగా అనిపించింది.అలాగే మా నిర్మాత బెన్నీ ఈ కథని, సినిమాని బాగా నమ్మారు. ఆయన ఎక్కడా రాజీపడలేదు. ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా. మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నా.