కార్మికుడికి న్యాయం చేయాలని నిరసన

నవతెలంగాణ-కూకట్‌పల్లి
ప్రశాంత్‌నగర్‌ ఇండిస్టియల్‌ ఎస్టేట్‌లోని సమ్మయి ప్యాకేజ్‌ ఇండిస్టీ కంపెనీలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజు గౌడ్‌ను విధుల నుంచి అక్రమంగా తొలగించారని సీఐటీయూ కూకట్‌పల్లి మండల కన్వీనర్‌ కె. కష్ణనాయక్‌ అన్నారు. కార్మికునికి న్యాయంగా రావాల్సిన గ్రాట్యుటీ, జీతభత్యాలు చెల్లించకుండా తొలగించడం సరైంది కాదన్నారు. గురువారం సమ్మయి ప్యాకేజ్‌ ఇండిస్టీస్‌ కంపెనీ ఎదుట బైటాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు, కంపెనీ యాజమానులు సంజరు కుమార్‌ అగర్వాల్‌ కార్మికునికి న్యాయం చేయాలని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కార్మికులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం చంద్రశేఖర్‌, నాయకులు రాజులు, శ్రీనివాసులు, ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love