గౌడవెళ్లి మల్లన్న జాతర మహౌత్సవంలో మంత్రి మల్లారెడ్డి

నవతెలంగాణ-మేడ్చల్‌
మేడ్చల్‌ మండల పరిధి గౌడవెళ్లి గ్రామంలోని మల్లిఖార్జున స్వామి జాతర మహౌత్సవంలో సోమవారం కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మల్లారె డ్డికి నాయకులు ఘనస్వాగతం పలికారు. జాతర మహౌ త్సవంలో భాగంగా ఉదయం గణపతి హౌమం, మధ్యాహ్నం స్వామి కళ్యాణం, సాయంత్రం అగ్నిగుండాలు, బోనాల ఊరేగింపు, గొలుసు తెంపుట వంటి కార్యక్రమాలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ భాస్కర్‌ యాదవ్‌, మాజీ ఎంపీపీ పద్మజగన్‌ రెడ్డి, మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు దయానంద్‌ యాదవ్‌, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్‌ రాజు, బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దుల శ్రీనివాస్‌ రెడ్డి, సొసైటీ ఛైర్మన్‌ రణదీప్‌ రెడ్డి, డైరెక్టర్‌ అప్పల కృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు గోమారం శ్రీనివాస్‌ రెడ్డి, జనరల్‌ సెక్రెటరీ సదానంద్‌ గౌడ్‌, సర్పంచ్‌ సురేందర్‌ ముదిరాజ్‌, ఉప సర్పంచ్‌ పెంటమ్మ, యాదవ సంఘం నాయకులు పెద్దగొల్ల దాసరి శంకర్‌, బండారి సింహాలు యాదవ్‌, ఎల్‌.రవిందర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Spread the love