జాతీయ గొర్ల, మేకల పెంపకందారుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయండి

– కేంద్ర మంత్రికి రాష్ట్ర పశుసంవర్థక, వ్యవసాయ పరిశోధన సంస్థ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జాతీయ గొర్ల, మేకల పెంపకందార్ల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర పశుసంవర్థక, వ్యవసాయ పరిశోధన సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, డైయిరీ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలకు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ అధ్యరంలోని బృందం వినతిపత్రం సమర్పించింది. రాష్ట్ర పశుసంవర్థక, వ్యవసాయ పరిశోధన సంస్థ నేషనల్‌ కన్వీనర్‌ బి రామచంద్రుడు, నేషనల్‌ కో కన్వీనర్‌ గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌, జాతీయ సమన్వయకర్తలు లొడంగి గోవర్ధన్‌ తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. గొర్ల మేకల రైతుల సమస్యలు, నేషనల్‌ బోర్డు ఏర్పాటు ఆవశ్యకతతోపాటు వివిధ అంశాలపై మంత్రితో విస్తృతంగా చర్చించారు. అనంతరం నేషనల్‌ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

Spread the love