టిఫిన్ లో బల్లి..!

– గర్ల్స్ హాస్టల్ లో వేలుగు చుసిన ఘటన.. 
– ఆలస్యంగా వెలుగులోకి..
– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు..
– వంట మనిషి సస్పెండ్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం యూనివర్సిటీ లోని బాలికల హాస్టల్ లో విద్యార్థులు అల్పాహారం భుజిస్తున్న సమయంలో ఓ విద్యార్థిని ప్లేటులో బల్లి దర్శనం ఇచ్చింది. దీంతో విద్యార్థులు ఒక్క సారి షాక్ కు గురయి తోటి విద్యార్థులకు ఈ విషయంపై తెలుపాగ అందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా విద్యార్థులను యూనివర్సిటీ అధికారులు  హెచ్చరించరని విశ్వసనీయంగా తెలిసింది. కొందరు లో ఏదో లోపాయి కారిగ  అధికారులతో మాట్లాడుకుని ఈ విషయాన్ని బయటకు పో కుండా తగు జాగ్రత్తలు తీసుకున్న ఇంకొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ముందుకు వచ్చి ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు శనివారం యూనివర్సిటీ కి వెళ్లి ఆందోళన నిర్వహించారు. గతం నుండి విద్యార్థి సంఘాలు విద్యార్థులు యూనివర్సిటీ వసతి గృహాల్లో విద్యార్థులకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆరోపించిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని, ఒకవేళ అదే విద్యార్థిని బల్లి పడిన ఆహారాన్ని తిని ఉంటే నేడు పరిస్థితి వేరే రకంగా ఉండేదని ఇది ముమ్మటికి అధికారుల నిర్లక్ష్యమేనని విద్యార్థి సంఘాల ఆరోపిస్తున్నాయి. అంతకుముందు కొంతమంది విద్యార్థులు టిఫిన్ కోసం చేసిన వెజ్ బిర్యానీ తిన్నారు కానీ ఎవరికి ఎలాంటి వాంతులు విరిచనాలు ఇప్పటివరకు జరగలేదని పలువురు పేర్కొన్నారు.వెంటనే అధికారులు ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు నిర్వహించాలని ఇది ఎవరి వల్ల జరిగిందో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఒకరి సస్పెండ్..!
తెలంగాణ యూనివర్సిటీ బాలికల వసతి  గృహంలో శుక్రవారం ఉదయం అల్పాహారంలో బల్లి వచ్చింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో విద్యార్థి సంఘాలు హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ వంట మనిషి రాజేష్ ను సస్పెండ్ చేశారు.
Spread the love