డాక్టర్‌ కూరెళ్ల అహల్యకు ఓయు నుంచి డాక్టరేట్‌

నవతెలంగాణ-నేరేడ్‌మెట్‌
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సంస్కత లెక్చరర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ కూరెళ్ళ అహల్యకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రకటించింది. ఈమె ప్రొఫె సర్‌ నీలకంఠం పర్యవేక్షణలో సంస్కత భాష, సాహిత్యానికి ప్రొఫెసర్‌ రవ్వ శ్రీహరి చేసిన కషి గురించి పరిశోధన చేశారు. కూరెళ్ళ గ్రామంలో జన్మించి చౌటుప్పల్‌ బాలికల గురుకుల పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీలో సాంస్కత విభాగంలో ఎంఏ పట్టాను పొంది, అలాగే ఎంఫిల్‌ పూర్తి చేసి డాక్టర్‌ ఫిలాసఫీ పట్టాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అందుకున్నారు. తన తండ్రి కురెళ్ళ మల్లయ్య ఎంతో కష్టపడి చదివించాడని, అలాగే తన బాబాయి కూరెెళ్ల చదవడంలో పెంటయ్య మార్గదర్శకత్వంలో ఉన్నత చదువులు చదివి పిహెచ్‌ డి పట్టాను అందుకున్నారు. ఈ పట్టాను తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్టు డాక్టర్‌ అహల్య తెలిపారు. పీహెచ్‌డీ పట్టాను పొందిన సందర్భంగా అహల్యను మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మల్కాజిగిరి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.శైలజ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్ల్లాడుతూ.. అహల్య సంస్కత భాషను అభివద్ధి పరచ డంలో కళాశాల ఎంతో కషి చేసిందని కొనియా డారు. ఆమె డాక్టరేట్‌ దక్కడం పట్ల కళాశాల అధ్యా, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అభినందలు తెలిపి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఏ చంద్రయ్య, డాక్టర్‌ బి. రాజు, డాక్టర్‌ ఎస్‌. రమేష్‌, డాక్టర్‌ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ రచన మల్లికా, డాక్టర్‌ జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love