మున్సిపాల్టీగా ఆసిఫాబాద్‌

– చట్ట సవరణ ఆమోదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జానకాపూర్‌, గొడవెల్లి గ్రామాలను కలుపుతూ ఆసిఫాబాద్‌ గ్రామ పంచాయతీని మున్సిపాల్టీగా మారుస్తూ మంత్రి కేటీఆర్‌ ప్రవేశపెట్టిన మున్సిపాల్టీ చట్టం, 2019 సవరణ బిల్లును శాసనమండలి ఆమోదించింది. ఆదివారం మండలిలో నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన బోయల పల్లి, తాళ్ల నరసింహాపురం గ్రామాలను మున్సిపాల్టీ నుంచి మినహాయిం చి కొత్త గ్రామపంచాయతీలుగా చేసిన సవరణను సభ్యులు ఆమోదిం చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి మండలంలోని భద్రాచలం, సీతారామ్‌నగర్‌, శాంతినగర్‌లను గ్రామ పంచాయతీలుగా, బూర్గుం పహాడ్‌ మండలంలోని సారపాక గ్రామ పంచాయతీని సారపాక, ఐటీసీ గ్రామ పంచాయతీలుగా, కొమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా రాజంపేట రెవె న్యూ గ్రామాన్ని గ్రామపంచాయతీగా సవరించారు. ఈ సవరణ బిల్లును సంబంధిత శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. అనంతరం గురుకుల డిగ్రీ కళాశాలల్లో బీయస్సీ (వ్యవసా యం), బీయస్సీ (ఉద్యానశాస్త్రం) కోర్సులకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలం గాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధం కళాశాలగా ఇచ్చేం దుకు వీలుగా చేసే సవరణ బిల్లును వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి ని రంజన్‌ రెడ్డి ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. అదే విధంగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) సిఫారసు మేరకు బీయస్సీ ఆనర్స్‌ (గృహ విజ్ఞాన శాస్త్రం), పేరును బీయస్సీ ఆనర్స్‌ సమాజ విజ్ఞాన శాస్త్రంగా మార్చారు.

Spread the love