రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలను తెరిపించాలి

నవతెలంగాణ-అడిక్‌మెట్‌
రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలను తెరిపించాల నీ, కనీస వేతనాలను సవరించాలని భారతీయ మజ్దుర్‌ సంఫ్‌ు రాష్ట్ర అధ్యక్షులు బి.రవీంద్ర రాజు వర్మ డిమాం డ్‌ చేశారు. మంగవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారతీయ మజ్దుర్‌ సంఫ్‌ు తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రవీంద్ర రాజు వర్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్‌.మల్లేశం, బీఎంఎస్‌ జాతీయ బొగ్గు గనుల ప్రభారి కె.లక్ష్మారెడ్డి, దక్షిణ క్షేత్ర సంఘటన కార్యదర్శి దురై రాజ్‌ హాజరై మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ 9 ఏండ్లలో తెలంగాణాలో కార్మికులు దగా పడ్డారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు కనీస వేతనాలు పెంచటానికి ముఖ్యమంత్రి సుముఖత చూపకపోవడం విడ్డూరం అన్నారు. కనీస వేతనాల విడుదల కాక, 36 రకాల కనీస వేతనాల నోటిఫికేషన్‌ లు 8 ఏండ్లుగా సీఎం కేసీఆర్‌ టేబుల్‌ పై పడి ఉండటం చూస్తే కార్మికుల పట్ల చిత్త శుద్ది ఎంత ఉందో అర్థం అవుతోందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం ”సమాన పనికి సమాన వేతనం” బుట్టదాఖలు అయిందన్నారు. నిజాం దక్కన్‌ షుగర్‌, కమలాపురం బిల్ట్‌ కంపెనీలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వాగ్దానం చేసి రెండు కంపెనీలు మూసివేసినట్టు తెలిపారు. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేలమంది కార్మికుల కుటుంబాలు రోడ్డు న పడ్డాయన్నారు. కార్మికులు సాధించుకున్న తెలంగా ణలో కాంట్రాక్ట్‌ లేబర్‌ను శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ భద్రత కరువైందన్నారు. కార్మికుల డిమాండ్ల సాధనకు భారతీయ మజ్దూర్‌ సంఘం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తుందనీ, ఈ న్యాయ పోరాటంలో కార్మికులు సైద్ధాంతిక విబేధాలు, రాజకీయాలు పక్కకు పెట్టి కలసి రావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love