మారెడ్డి జిల్లా సమీకృత కర్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 114 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మందిరంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మొత్తం 114 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో 56 రెవెన్యూ శాఖకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పి సీఈవో చందర్, డిపిఓ శ్రీనివాసరావు, డి ఆర్డిఓ సురేందర్, మసూర్ అహ్మద్, అధికారులు పాల్గొన్నారు.