16 ఏళ్ల అమ్మాయిని అతి దారుణంగా..సీఎం సీరియస్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇవాళ ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో దారుణమైన హత్య జరిగింది. ఒక యువకుడు 16 సంవత్సరాల అమ్మాయిని అతి దారుణంగా కత్తితో పోడిచి చంపాడు. ఈ హత్య జరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ హత్య ఎంత దారుణంగా జరిగిందంటే ఒక మనిషిపై ఇంత కసి ఉంటుందా అన్నట్లు ఉంది. ఆ అమ్మాయిని యువకుడు కత్తితో 40 సార్లు పొడిచి చంపాడు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ అయ్యాడు. బహిరంగంగా ఇలా హత్య జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం నేరస్థులకు పోలీసులు అంటే పూర్తిగా భయం లేకుండా పోయింది. ఇంత దారుణంగా, ఎటువంటి భయం లేకుండా బహిరంగంగా హత్యలు చేస్తున్నారు అన్నారు. అంతే కాకుండా వెంటనే ఢిల్లీ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పూర్తి బాధ్యత లెఫ్టినెంట్ గవర్నర్ ది అని చెప్పారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోండి అంటూ కేజ్రీవాల్ ఆయనను ఆదేశించారు. ఇంకా ఈ దేశంలో ఎంతమంది ఆడకూతుర్లు ఇలా ఈ దుర్మార్గులకు బలవ్వాలి అంటూ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Spread the love