నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తొలివిడత రుణమాఫీ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ. 167.59 కోట్ల విడుదల చేసింది. రూ.37వేల నుంచి రూ.41వేల మధ్య ఉన్న రుణాలను మాఫీ చేసింది. గురువారం ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో 44,870 మంది రైతులకు లబ్దిచేకూరిందని పేర్కొన్నారు.
రైతు బీమా కోసం కొత్త దరఖాస్తులు అప్‌లోడ్ చేయండి
రైతు బీమాకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో వెంటనే కొత్త వచ్చిన దరఖాస్తులను అప్‌లోడ్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. సేంద్రీయ ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులను మరింత ప్రోత్సహించాలని ఒక ప్రకటనలో కోరారు. పంటల సాగు వివరాలు వెంటనే తెలపాలని ఆదేశించారు. వరి, కంది, పంటలు ఈ నెలాఖరు వరకు, మిరప సెప్టెంబరు మొదటి వారం వరకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. గురువారం ఈమేరకు సచివాలయంలో అన్ని జిల్లాల డీఏవో, డీహెచ్‌ఎస్‌వో, ఇతర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు కొండిబ, అగ్రోస్ ఎండీ రాములు, ఏడీడీ విజరుకుమార్, ఉద్యానశాఖ జేడీ సరోజి తదితరులు పాల్గొన్నారు.