సెప్టెంబర్ 30 వరకు 2వేల నోట్లు ఎక్స్చేంజ్..58 రోజులు సెలవులు

నవతెలంగాణ-హైదరాబాద్ : బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ మీరు రూ.2 వేల నోట్లను మార్చుకోవాలని భావిస్తున్నారా? అయితే దీనికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. అయితే ఈ కాలంలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి. ఆర్‌బీఐ ఇటీవలనే కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటునట్లు వెల్లడించింది. అందువల్ల జనాలు వారి వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను సులభంగా మార్చుకోవచ్చు. బ్యాంకులకు వెళ్లి ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఉచితంగానే రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 30 వరకు రూ.2 వేల నోట్లు మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.అయితే మనం ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులకు ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉన్నాయో తెలుసుకుందాం. బ్యాంక్ హాలిడేస్ అనేది రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటారు. ఏ ఏ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పని చేయవో ఇప్పుడు తెలుసుకుందాం.బ్యాంక్‌కు వెళ్లి రూ.2 వేల డబ్బులు డిపాజిట్ చేయాలని భావించే వారు బ్యాంక్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం ఉత్తమం. దీని వల్ల ఇబ్బంది లేకుండా సులభంగానే రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు.
జూన్ నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజులు సెలవులు ఉన్నాయి.
జూన్ 15న రాజా సంక్రాంతి, జూన్ 20న రథ యాత్ర, జూన్ 26న కరాచీ పూజ, జూన్ 28న బక్రీద్, జూన్ 29న బక్రీద్, ఈద్ ఉల్ జుహా జూన్ 30న వచ్చింది. అలాగే జూన్ నెలలో ఆది వారాలు ఉన్నాయి. ఇంకా రెండో శనివారం, నాలుగో శనివారం ఉన్నాయి. వీటిని కూడా కలుపుకుంటే.. మొతంగా జూన్ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఇంకా జూలై నెలలో బ్యాంక్ హాలిడేస్‌ను గమనిస్తే.. ఏకంగా 15 రోజులు హాలిడేస్ ఉన్నాయి. జూలై 5న గురు హర్‌గోవింద్ జయంతి, జూన్ 6న ఎంహెచ్‌ఐపీ డే, జూలై 11న కేర్ పూజ, జూలై 13న భాను జయంతి, జూలై 17న యూ టిరోత్ సింగ్ డే, జూలై 21న ద్రుక్పా తేష్ జి, జూలై 28న అశూర, జూలై 29న మొహరం ఉన్నాయి. అంతే కాకుండా ఈ నెలలో కూడా ఆదివారాలు, నాలుగో శనివారం, రెండో శనివారం కూడా ఉన్నాయి. అందువల్ల వీటిని కలుపుకుంటే జూలై నెలలో 15 రోజుల పాటు బ్యాంకులు పని చేయవని చెప్పుకోవచ్చు.
ఆగస్ట్ నెలలో బ్యాంక్ హాలిడేస్‌ను చూస్తే.. 14 రోజులు బ్యాంకులు పని చేయవు
ఆగస్ట్ 8న టెన్‌దోంగ్ హో రమ్ ఫాట్, ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 16న పార్సి న్యూ ఇయర్, ఆగస్ట్ 18న తిథి ఆఫ్ శ్రీమంత శంకరదేవ, ఆగస్ట్ 28న ఫస్ట్ ఓనం, ఆగస్ట్ 29న తిరువోనం, ఆగస్ట్ 30న రక్షాబంధన్, ఆగస్ట్ 31న శ్రీ నారాయణ గురు జయంతి ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఆగస్ట్ నెలలో కూడా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం ఉన్నాయి. ఇవ్వన్నీ కలుపుకుంటే ఆగస్ట్ నెలలో కూడా బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు.
సెప్టెంబర్ నెలలో చూస్తే..
సెప్టెంబర్ 6న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 7న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 18, 19, 20న వినాయక చవితి, సెప్టెంబర్ 22న శ్రీ నారాయణ గురు సమాధి డే, సెప్టెంబర్ 23న మహరాజ హరి సింగ్ జి జయంతి, సెప్టెంబర్ 25న శ్రీమంత శంకరదేవ జన్మోత్సవ్, సెప్టెంబర్ 27న మిలాద్ ఐ షెరిప్, సెప్టెంబర్ 28న ఈద్ ఇ మిలాద్, సెప్టెంబర్ 29న ఇంద్రజత్ర ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో ఇంకా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం ఉన్నాయి. ఇవి కూడా కలుపుకుంటే సెప్టెంబర్ నెలలో బ్యాంకులు ఏకంగా 17 రోజులు సెలవులు ఉన్నాయి.

Spread the love