డబ్ల్యూహెచ్జెనీవా
జెనీవా : ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా మహమ్మారి లక్షణాలతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డిఆర్ సి)లో 220 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ ప్రకటించారు. అలాగే కేసుల సంఖ్య 990కు చేరినట్లు తెలిపారు. ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, ప్రపంచ దేశాలు ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాంగో ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 101 నిర్థారించిన కేసులు, 10 మరణాలు నమోదైనప్పటికీ, వాస్తవ పరిస్థితి ఇంతకంటే చాలా తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురావడానికి కాంగో ఆరోగ్య శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ నెల 17న ఎబోలా కారణంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని డబ్ల్యూహెచ్ ఓ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎబోలో వైరస్ ఉగాండాకు కూడా వ్యాపించింది. ఇప్పటి వరకూ ఉగాండాలో ఐదు కేసులు నమోదు కాగా ఒకరు చనిపోయారు. కాగా, బండిబుగ్యో ఎబోలా వైరస్ కు డబ్ల్యూహెచ్ ఓ ఆమోదించిన వ్యాక్సిన్‌లు, చికిత్సలు ఏవీ లేవు. ఈ రకం వైరస్ గతంలో కేవలం రెండుసార్లు మాత్రమే వ్యాప్తి చెందింది. 2007లో ఉగాండాలోనూ, 2012లో కాంగాలోనూ ఇది వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఎబోలా వ్యాప్తిని అరికట్టడానికి డబ్ల్యూహెచ్ ఓ కట్టుబడి ఉందని టెడ్రోస్ ఈ సందర్భంగా తెలిపారు.
కాంగోలో ఎబోలాతో 220 మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



