Wednesday, May 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రొఫెసర్‌ నాగేశ్వర్అరెస్ట్‌ ప్రయత్నాలను అడ్డుకుంటాం

ప్రొఫెసర్‌ నాగేశ్వర్అరెస్ట్‌ ప్రయత్నాలను అడ్డుకుంటాం

- Advertisement -


భావప్రకటన స్వేచ్ఛను తప్పుపడతారా ?
ఏపీ సర్కారు, పోలీసులకు TWJF, HUJ హెచ్చరిక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్, డాక్టర్ నాగేశ్వర్ విషయంలో ఏపీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్‌) యాక్టింగ్‌ ‌ప్రెసిడెంట్‌ పి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య, హెచ్‌‌యూజే అధ్యక్షులు బి ఆరుణ్ కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్ ఖండించారు. ఏపీ రాజకీయాల విశ్లేషణ నేపథ్యంలో డాక్టర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యానం ఉపసంహరించుకున్నా రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటాన్ని తప్పుపట్టారు. ఏపీ పోలీసులు డాక్టర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలు, దైనందిన రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలను, మేధావులు, సామాన్యులను చైతన్యం చేయడమే ధ్యేయంగా నాగేశ్వర్ పనిచేస్తున్నారని గుర్తు చేశారు. నాగేశ్వర్ ప్రసంఘాలు, వ్యాసాలు, పాడకాస్ట్ లకు ప్రజల్లో భారీ స్పందన ఉంటుందని గుర్తు చేశారు . ఒకవేళ ఆయన చెప్పేది తప్పైతే ప్రజలు స్పందించరనే విషయాన్నీ ఏపీ ప్రభుత్వం, పోలీసులు గ్రహించాలని హితవు పలికారు.

ఒకవేళ జర్నలిస్టుగా నాగేశ్వర్‌ ‌చేసిన వాఖ్యానంలో పొరపాట్లు ఉంటే భారత ప్రెస్‌‌కౌన్సిల్‌‌కు ఫిర్యాదు చేసుకోవచ్చని తెలియజేశారు. ప్రాథమిక చర్యలేవీ లేకుండా కేసులు పెట్టి అరెస్ట్‌‌ చేస్తామంటే ఎవరూ చేతులుమడుచుకు కూర్చోలేదని చెప్పారు. డాక్టర్ నాగేశ్వర్‌ ‌కు తెలంగాణ పోలీసులు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంతరెడ్డి జోక్యం చేసుకోవాలనీ, నాగేశ్వర్ అరెస్ట్ను అనుమతించరాదని కోరారు. నాగేశ్వర్ను అరెస్ట్ చేసే ప్రయత్నాలను టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌‌యూజే సంఘాలు అడ్డుకుంటాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అనవసర ఉద్రిక్తలకు ఏపీ పోలీసులు కారణం కావొద్దని అభిప్రాయపడ్డారు. పాత్రికేయరంగానికి ప్రతినిధిగా డాక్టర్ నాగేశ్వర్ ను తాము చూస్తామని, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. భవిష్యత్‌‌లో కూడా నాగేశ్వర్‌‌ను అరెస్ట్‌ ‌చేసే కుయత్నాలకు పాల్పడితే ఫెడరేషన్‌ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని వాఖ్యానించారు. ప్రజాసంఘాలు సైతం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్‌‌లో ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -