నర్సుగొండ గోరంచే వర్ధంతి సందర్భంగా 25 మంది యువకులు రక్తదానం

– ఊరు చిన్నదైనా రక్తదానంలో గొప్పది సర్పంచ్ రాజాబాయి విలాస్
నవతెలంగాణ -మద్నూర్
నర్సు గొండ గోరంచే వర్ధంతిని పురస్కరించుకొని డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ రాజాబాయి విలాస్ మాట్లాడుతూ.. మా ఊరు చిన్నదైనా రక్తదానంలో గొప్పదని పేర్కొన్నారు రక్తదానం కోసం 25 మంది ముందుకు వచ్చి రక్తదానాన్ని అందించడం అన్నింటికంటే రక్తదానం గొప్పదని ఇలాంటి రక్తదానం కోసం యువకులు ముందుకు రావడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు రక్తదానం చేసిన యువకులకు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నర్సుగొండ కుమారులు రమేష్ గొండ, సాయిలు గొండ, బీఆర్ఎస్ వి జిల్లా ఆధ్యక్షులు విలాస్ గైక్వాడ్ , స్కూల్ చైర్మన్ మూజుఫ్ పటేల్, కృష్ణ పటేల్, షాదుల్ సాబ్, యాదవ్ రావ్ పటేల్, సాదిక్ సాబ్, జీలానిసాబ్, సుధాకర్ పటేల్, మాధవ్ పటేల్, వజీరసాబ్,  గ్రామస్థులు పాల్గొన్నారు
Spread the love