38 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన..

– చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్:
చౌటుప్పల్ మండలంలో తూప్రాన్ పేట,పీపల్ పహాడ్ గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ మండల పరిషత్ 38 లక్షల 50 వేల రూపాయల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలం లో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా తూప్రాన్ పేట పీపల్ పహాడ్ గ్రామాలలో ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక అధికారి ముత్యాల నాగరాజు పీపల్ పహాడ్ ఎంపిటిసి దోసపాటి జ్యోతిజంగయ్యగౌడ్ పి ఆర్ ఏఈ సందీప్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులు పానుగోతు లచ్చిరాం నాయక్,విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సుంచు రాజు, వినుకొండ సత్యనారాయణ,జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Spread the love