సంతోశ్‌ కంపెనీతో ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం

సంతోశ్‌ కంపెనీతో ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం– మహిపాల్‌, మధుసుదన్‌ లాకర్స్‌ తెరవాలి
– ఈడీ అధికారుల వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసుదన్‌రెడ్డికి చెందిన సంతోశ్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ కంపెనీ ప్రభుత్వం ఖజానాకు రూ.39 కోట్ల నష్టాన్ని చేకూర్చిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు శుక్రవారం తెలిపారు. మహిపాల్‌రెడ్డి, మధు సుదన్‌రెడ్డి యజమానులుగా ఉన్న సంతోశ్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్‌ కంపెనీ సంగారెడ్డి జిల్లాలోని లక్డారం గ్రామంలో గ్రానైట్‌ తవ్వకాల ను జరుపుతూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయితీని ఎగవేసిందని తాము జరిపిన దాడుల్లో వెల్లడైనట్టు ఈడీ తెలిపింది. పటాన్‌చెరులోని ఎమ్మెల్యే, ఆయన సోదరుడి నివాసంతో పాటు మొత్తం 10 ప్రాంతాల్లో తమ సోదాలు సాగాయ ని వివరించింది. ప్రభుత్వం కేటాయించి న భూమి కంటే ఎక్కువ భూమిలో గ్రానైట్‌ తవ్వకా లను ఈ కంపెనీ సాగించిందనీ, తమ కంపెనీ ద్వారా గ్రానైట్‌తో పాటు పలు ముడి సరుకులను దాదాపు రూ.300 కోట్లకు పైగా విలువైన ఎగుమతులు చేశారనీ, దానికి సంబంధించిన అకౌంట్స్‌ పుస్తకాలను సక్రమంగా నిర్వహించ కుండా ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపినట్టు గా కూడా తమ సోదాల్లో వెలుగు చూసిందని ఈడీ చెప్పింది. ఈ దాడుల్లో బినామీల పేర్లతో పెద్ద మొత్తంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని కూడా నిర్వహించి నట్టు బయటపడిందనీ, అందుకు సంబంధించి పెద్ద మొత్తంలో భూము ల రిజిస్ట్రేషన్‌ డాక్యుమెం ట్లను వీరి నివాసాల నుంచి స్వాధీనపర్చుకున్నా మని వివరించింది. అలాగే, రూ.19 లక్షల లెక్కపత్రాలు లేని డబ్బులను కూడా స్వాధీనప ర్చుకున్నామని ఈడీ తెలిపింది. ఇంకా, ఎమ్మెల్యే, ఆయన సోదరుడికి చెందిన బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉన్నదని దర్యాప్తు సంస్థ వివరించింది. మొత్తమ్మీద వీరిపై మనీలాండరింగ్‌ యాక్ట్‌ కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఈడీ తెలిపింది.

Spread the love