కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి కూలీలకు రూ.400 

– శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు 
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధిహామీ కూలీలకు రోజువారి కూలి వేతనం రూ.400 అమలు చేస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఉపాధి హామీ కూలీలతో శ్రీను బాబు ఉపాధి హామీ కూలీలతో ముచ్చటిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.400 పెంపు చేస్తామన్నారు. కాటారం  మండల కేంద్రములో గురువారం ఆంజనేయ స్వామి  ఆలయం లో ప్రత్యెక పూజలు నిర్వహించి, ఉపాధి హామీ కూలీలకు, ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని కోరారు. ఎన్నికల కోడ్ తరువాత రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం జరుగుతుందన్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 5 న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పంటకు కనీస మద్దతు ధర,  ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా  రూ.లక్ష, ఆరోగ్య బీమా రూ.25 లక్షలు, యువతకు రూ.30 లక్షల ఉద్యోగలు కలిపించడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 న్యాయ గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love